Raghurama Vs YCP: రఘురామ మిడిల్ డ్రాప్.. ప్రధాని సభకు డుమ్మా

Share

Raghurama Vs YCP: రెండున్నర సంవత్సరాల తరువాత అయినా ప్రధాని మోడీ పర్యటనతో సొంత గడ్డపై అడుగుపెట్టాలనుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కల సఫలం కాలేదు. నరసాపురం లోక్ సభ స్థానం నుండి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా గెలిచిన రఘురామ కృష్ణరాజు కొద్ది నెలలోనే రెబల్ గా మారారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పాటు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై రచ్చబండ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించి పార్టీ నుండి బహిష్కరించాలని వైసీపీ అధిష్టానం భావించింది. ఆయన పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసింది వైసీపీ. అయితే నెలలు గడుస్తున్నా ఆయనపై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలోనే రఘురామ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నరసాపురం నియోజకవర్గ పరిధిలో పలు కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం వర్సెస్ రఘురామ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయారు. రాజద్రోహం తదితర సెక్షన్ల కింద ఆయన పై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేసి జైలుకు తరలించడం లాంటి ఘటనలు జరిగిపోయాయి. ఇంకా పలు పోలీస్ స్టేషన్ లపై కేసులు నమోదు అయి ఉండటంతో హైకోర్టును ఆశ్రయించి ఆరెస్టుల నుండి మినహాయింపు పొందారు రఘురామ. రాష్ట్రంలో అడుగు పెడితే ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో రెండున్నరేళ్ల నుండి రఘురామ ఎపికి రావడం లేదు. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండుగలకు కూడా స్వగ్రామం భీమవరంలో అడుగు పెట్టలేకపోయారు.

Raghu Rama Vs YCP MP Raghu Rama cancelled his bhimavaram visit

 

తాజాగా ఈ రోజు (జూలై 4) తన నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో ప్రధాని మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో కార్యక్రమంలో హజరు అవ్వాలని భావించారు. ప్రభుత్వం కొత్త కేసులు ఏమైనా నమోదు చేసి అరెస్టు చేస్తుందేమో అన్న భయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. పోలీసులు కొత్తగా ఏదైనా కేసులు నమోదు చేసినా చట్ట, న్యాయపరిధిలో నడుచుకోవాలని, వెంటనే అరెస్టు చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భీమవరంకు హెలికాఫ్టర్ లో వచ్చేందుకు రఘురామ ప్రయత్నం చేశారు. అయితే హెలికాఫ్టర్ లాండింగ్ కు ముందుగా అనుమతి ఇచ్చి తరువాత కాన్సిల్ చేసినట్లు రఘురామ చెబుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవ కార్యక్రమాలకు రఘురామకు అహ్వానం పంపలేదు. ప్రధానితో వేదిక పంచుకునే జాబితాలో ఆయన పేరు లేదు. అయినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రఘురామ ఆదివారం రాత్రి నర్సాపుర్ ఎక్స్ ప్రెస్ లో తన భద్రతా సిబ్బందితో బయలుదేరారు.

 

ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. తొలుత ఫేస్ బుక్ లైవ్ లో తాను నర్సాపుర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరినట్లు వెల్లడించారు రఘురామ. తనను ఎపి ఇంటెలిజెన్స్ పోలీసులు ఫాలో అవుతున్నారని కూడా చెప్పారు. భీమవరంలో తనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్బందులు గురి చేస్తున్నారనీ, వారి పేరెంట్స్ తో తనకు ఫోన్ చేయించి భీమవరం రావద్దు చెప్పించారని రఘురామ పేర్కొన్నారు. తనకు మద్దతు ఇచ్చే నాయకులపై కేసులు కూడా నమోదు చేశారని ఆరోపించారు. తనకు మద్దతు ఇచ్చే వాళ్లకు ఇబ్బందులు కల్గించవద్దన్న ఉద్దేశంతో భీమవరం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన రఘురామ బేగంపేట రైల్వే స్టేషన్ లో దిగిపోయి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంలో ప్రభుత్వం తన పట్ల అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రఘురామ. రఘురామ మిడిల్ డ్రాప్ వ్యవహారం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

56 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago