NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీ కీలక ప్రకటన

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామనీ, ఆ హామీల్లోనే పోలవరం ప్రాజెక్టు ఉందని అన్నారు. విభజన హామీల అన్నీ కేంద్రం అమలు చేయాలన్నారు. ఏపికి ఒకే రాజధాని ఉండాలనీ, మూడు రాజధానుల ఆలోచన మంచిది కాదని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Rahul Gandhi

 

భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తొందనీ, యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పట్ల ఏపి ప్రజల వైఖరి మారుతుందని చెప్పారు. పాదయాత్రలో వస్తున్న స్పందన చూస్తుంటేనే అది అర్ధమవుతోందన్నారు. ఇక ఎన్నికల్లో పొత్తుల అంశం తన పరిధిలోనిది కాదన్నారు. పార్టీ అధ్యక్షుడితే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఖర్గే, శశిథరూర్ లు అనుభవజ్ఞులని వారికి తన సలహాలు అవసరం లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారం చూపేందుకు యంత్రాంగం ఉందని రాహుల్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ లో తప్ప ఏ పార్టీలోనూ బహిరంగంగా నేతలు తమ అభిప్రాయాలు, అసంతృప్తిని వ్యక్తం చేయరని అన్నారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజా స్వామ్యబద్దంగా జరిగాయని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ విధానాలు నాశనం చేశాయని విమర్శించారు. ఉపాధి అవకాశాలు కరువయ్యాయనీ, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. జీఎస్టీ వల్ల ప్రజలపై మరింత భారం పడిందన్నారు. బలవంతంగా పన్నులను రుద్దిందని ఆయన పేర్కొన్నారు.

ఖర్గే ఘన విజయం .. 24 ఏళ్ల విరామం తర్వాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ బాస్ గా ఎన్నిక

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk