chirala (bapatla): ఒడిశా రైలు ప్రమాద ఘటన తర్వాత సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహిస్తున్నారు. గ్యాంగ్ మెన్ అప్రమత్తత కారణంగా సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది. విధుల్లో భాగంగా రైల్వే ట్రాక్ ను పరిశీలన చేస్తున్న గ్యాంగ్ మెన్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ మార్గం మీదుగా బెంగళూరు వెళ్లాల్సిన సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ ను స్టేషన్ లోనే నిలుపుదల చేశారు.

స్టేషన్ లోనే రైలును నిలుపుదల చేయడంపై ప్రయాణీకులు ఏమి జరిగిందో తెలియక అసహానికి గురైయ్యారు. రైల్వే సిబ్బంది ట్రాక్ వద్దకు చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. గ్యాంగ్ మెన్ పట్టా విరిగి ఉండటాన్ని గమనించకపోయి ఉంటే మరో ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ఈ విషయం తెలుసుకున్న రైలులోని ప్రయాణీకులు ఒక్క సారిగా ఊపిరిపీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం గువాహటి నుండి జమ్ముకు వెళుతున్న లోహిత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా ప్రమాదం తప్పింది. ఇంజన్ నుండి బోగీలు విడిపోయి ట్రాక్ పైనే ఆగిపోయాయి. అధికారులు వెంటనే ఆ మార్గంలో రైల్ల రాకపోకలను ఆపి, బోగీలను తిరిగి రైలుకు జత చేసి పంపారు.
Pawan Kalyan: నాకంటే వాళ్లు పెద్ద హీరోలు అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Singer Sunitha: సరిగ్గా 5 నిమిషాల క్రితం ఇన్ స్టాలో ఒక వీడియో పెట్టిన సునీత.. వెంటనే ఓపెన్ చేయండి.. అలా చూస్తూ ఉండిపోతారు!