Rain Alert: ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ పరిసరాల్లో కొనసాగుతొన్న ఉపరితల అవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందనీ, దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమ గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురస్తాయని పేర్కొంది. అదే సమయంలో గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో ఊదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

విదర్భ నుండి కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి తూర్పు దిశకు పయనించే క్రమంలో రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుండి ధ్రోణి కోస్తాపైకి వస్తుందని, ఆ తర్వాత నుండి వర్షాలు కురస్తాయని చెప్పారు. ఏప్రిల్ 30 నుండి మే 3,4 తేదీల వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు గాలి తీవ్రత పెరుగుతుందని వివరించారు. వారం రోజుల పాటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు పంటలు దెబ్బతినకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
గత మూడు నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా భానుడి భగభగల నుండి ప్రజలకు ఉప శమనం లబించగా, రైతులకు మాత్రం తీరని నష్టం వాటిల్లింది. వడగండ్లు, భారీ వర్షాలకు మరి కొద్దిరోజుల్లో చేతికి అందివస్తుందనుకున్న పంట దెబ్బతిన్నది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దెబ్బతిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
YS Viveka Murder Case: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు ..సునీతకు మద్దుతుగా