Rain Alert: ఏపిలో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి. రేపటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయి. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ ఈ నెల 31వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది.

ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బెంగళూరుకు తారకరత్న తరలింపు ..ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?