NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: ఏపిలో రైతులకు ముందే వచ్చిన దీపావళి..! రైతు భరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. !!

YS Jagan: Complete Scuffling New Strategy for 2024..!?

AP CM YS Jagan: దీపావళి పండుగ దేశ వ్యాప్తంగా నవంబర్ 4వ తేదీన ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే ఏపిలో రైతులకు ముందే దీపావళి పండుగ వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం..ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను లబ్దిదారుల ఖాతాలోకి సీఎం వైఎస్ జగన్ నేడు విడుదల చేశారు.  వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం కింద ఏపిలో 50 లక్షల మంది రైతులకు లబ్దిచేకూరనుంది. సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాలో నిధులను జమ చేశారు.

Raithu bharosa funds released by AP CM YS Jagan
Raithu bharosa funds released by AP CM YS Jagan

 

Read More: Mandali Buddha Prasad: టీటీడీకి మాజీ డిప్యూటి స్పీకర్ మండలి బుద్దప్రసాద్ కీలక సూచన..!!

AP CM YS Jagan: ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..రైతు కళ్లల్లో దీపావళి వెలుగులు చూడాలని పండుగకు ముందే రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమనీ, రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకూ రూ.18,777 కోట్లు విడుదల చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు ర.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు. కరువు సీమలోనూ నేడు పుష్కలంగా సాగునీరు అందుతొందని చెప్పారు. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఈ క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

6.67 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ

ఖరీఫ్ – 2020 సీజన్ కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.20కోట్లు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును జమ చేశారు. వైఎస్ఆర్ యంత్ర పరికరాల పథకం కింద రూ. 2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతు గ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకురాగా ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను నేడు రైతు గ్రూపులకు జమ చేసింది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N