Nara Bhuvaneswari: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ములాఖత్ కొరకు ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం ధరఖాస్తు చేసుకోగా జైల్ అధికారులు తిరస్కరించారు. అయితే వారానికి మూడు సార్లు ములాఖత్ కు అవకాశం ఉన్న అధికారులు కావాలనే భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు ను తిరస్కరించారంటూ వార్తలు వస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ వారంలో తొలుత భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి లు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.
ఆ తర్వాత గురువారం నందమూరి బాలకృష్ణ, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. ఈ మధ్యలో చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అయితే శుక్రవారం నారా భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరణపై జైళ్ల శాఖ కోస్తా ఆంధ్ర ప్రాంత ఉప శాఖాధికారి స్పందించారు. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరణకు సంబంధించి కారణాలను పత్రికా ప్రకటన లో వివరించారు.
సాధారణంగా ఒక రిమాండ్ ముద్దాయికి ఒక వారంలో రెండు ములాఖత్ లు మాత్రమే ఇవ్వబడుతుందని, ఒక ములాఖత్ నందు ముగ్గురు సందర్శకులకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని చెప్పారు. 12వ తేదీ భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి లు చంద్రబాబుతో ములాఖత్ కాగా, 14వ తేదీ కొణిదెల పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లు ములాఖత్ అయ్యారని చెప్పారు.
అత్యవసర కారణాలతో ఎవరైనా సందర్శకులు రిమాండ్ ముద్దాయిని కలిసి మాట్లాడటానికి లిఖిత పూర్వకంగా అభ్యర్ధించినట్లయితే అట్టి అత్యవసర కారణము వాస్తవము అని నిర్ధారణ జరిగిన మీదట జైలు పర్యవేక్షణాధికారి వారి యొక్క విచక్షణాధికారములను ఉపయోగించి మూడవ ములాఖత్ ను మంజూరు చేస్తారని చెప్పారు. అయితే ఈ ప్రస్తుత సందర్భంలో అటువంటి అత్యవసర కారణం లేనందున నారా భువనేశ్వరి అత్యవసర పరిస్థితిని ప్రస్తావించనందున మూడవ ములాఖత్ ను మంజూరు చేయడం జరగలేదని వివరణ ఇచ్చారు.
Nara Lokesh: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయం .. కేంద్ర పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి చేరిన నారా లోకేష్