NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. చంద్రబాబు సమకాలికులుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రికి ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు అత్యంత సన్నిహితులు. వాస్తవానికి 2019లో గెలిచిన తర్వాత ఇవే తన ఎన్నికలని… రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని నర్మగర్భంగా చౌదరి చెప్పేశారు. తనకు బదులుగా తన తమ్ముడి కుమారుడు డా.రవికి అవకాశం ఇవ్వాలని కూడా సూచించారు. అందుకు తగినట్లుగానే నియోజకవర్గంలో రవి విస్తృతంగా తిరిగారు కూడా. అయితే అనూహ్యంగా సిట్టింగ్‌లకే సీట్లు అని చంద్రబాబు ప్రకటించటంతో… తప్పని పరిస్థితుల్లో బుచ్చయ్య చౌదరి మరోసారి బరిలోకి దిగారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తుండగా… వైసీపీ తరఫున మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో… రామచంద్రాపురం నుంచి చెల్లుబోయినను రాజమండ్రి రూరల్‌కు జగన్‌ బదిలీ చేశారు. ఇది ఆ పార్టీకి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం.. బుచ్చయ్య మాట తీరు. ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉండటంతో పాటు వివాద రహితునిగా పేరు కూడా.

ఇక వైసీపీ మంత్రి చెల్లుబోయినకు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. చెల్లుబోయినకు టికెట్ ఇవ్వటం పట్ల స్థానిక వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కూడా. అయితే పార్టీ అధినేతకు ఎదురు చెప్పలేక సైలెంట్‌గా ఉండిపోయారు. పైగా చెల్లుబోయిన నాన్ లోక‌ల్ కూడా..! ఇటు టీడీపీ, జనసేన కూటమిలో కూడా కొంత స్తబ్ధత ఉన్న మాట వాస్తవం. వాస్తవానికి రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ పోటీ చేస్తారని అంతా భావించారు.

కానీ సిట్టింగ్ నియోజకవర్గం వదిలేందుకు చంద్రబాబు విముఖత చూపటంతో.. చివరి నిమిషంలో దుర్గేష్‌ను నిడదవోలు పంపారు పవన్ కల్యాణ్. దీంతో దుర్గేష్ వర్గం కొంత అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే దుర్గేష్ గెలుపు బాధ్యతను చంద్రబాబు తీసుకోగా… బుచ్చయ్య కోసం కందుల దుర్గేష్ పూర్తి సహాయం అందిస్తున్నారు. రాజమండ్రి రూరల్‌లో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?