23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Rajampet Parliament: టీడీపీ వేడి నెలలోనే చల్లారింది ..! రాజంపేట పార్లమెంట్ లో ఎవరిది బలం ..!?

Share

Rajampet Parliament: రాష్ట్రంలోని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఒక ప్రెస్టేజియస్ సీటు. ఎందుకంటే..? టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ శతృవుగా ఉండి, చంద్రబాబు రాజకీయ జీవితాన్నే దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచి మూడవ సారీ గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో టీడీపీకి పరిస్థితి బాగానే ఉండేది. అయితే కాలక్రమేణా ఆ నియోజకవర్గంలో టీడీపీ పునాదులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అని చెప్పడానికి అభ్యర్ధి మార్పే ఉదాహారణ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో రెండు పార్టీల బలాలు ఏమిటి..? బలహీనతులు ఏమిటి..? జనసేన ప్రభావం ఎంత..?  మేరకు ఉంటుంది అనేది పరిశీలిస్తే.. రాజంపేట పార్లమెంట్ ను ఇంతకు ముందు 1984, 1999 ఎన్నికల్లో కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మధ్యలో 89, 91, 96, 98, 2004, 2009 ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి సాయప్రసాద్ విజయం సాధించారు. 2014,, 2019లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ నుండి గెలిచారు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున గంటా నరహరి అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు దాదాపుగా ఖరారు చేశారు. వైసీపీ తరపున మళ్లీ మిథున్ రెడ్డే పోటీ చేయనున్నారు. మిథున్ రెడ్డి అంటే ఆ కుటుంబానికి ఉన్న అంగ బలం, అర్థబలం ఇవన్నీ ఎక్కువ. ఈ బలమైన అభ్యర్ధిని ఢీకొట్టాలంటే అంగ బలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న బలిజ సామాజికవర్గానికి చెందిన గంటా నరహరిని టీడీపీ తీసుకువచ్చింది.

Peddireddy Midhun Reddy, Ganta Narahari

Rajampet Parliament: నాలుగు సిగ్మెంట్ లలో వైసీపీదే హవా

రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి కడప జిల్లా నుండి మూడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్ లు ఉన్నాయి. కడప జిల్లా లోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచూరు,. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి, పీలేరు. తంబళ్లపల్లి, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నియోజకవర్గాల వారీగా బలాలు చూసుకుంటే .. పుంగనూరులో వైసీపీదే బలం ఎక్కువ. పీలేరులో టీడీపీ, వైసీపీ సమానంగా ఉంటుంది. రాయచోటిలో ఇప్పటి వరకూ వైసీపీకే అనుకూలంగా ఉంది. రాజంపేటలో బలాబలాలు సమానంగా ఉన్నా కాస్త టీడీపీకే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. రైల్వే కోడూరులో కాస్త వైసీపీకే అనుకూలం. ఇక తంబళ్లపల్లి లో కష్టపడితే టీడీపీకి మారే అవకాశం ఉందని అంటున్నారు. మదనపల్లిలో సమానంగా బలాలు ఉన్నప్పటికీ వైసీపీకే కాస్త ఎడ్జ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీకి ఇక్కడ నాయకత్వ లోపం, ముస్లిం సామాజికవర్గ ఓట్లు ఎక్కువ తదితర కారణాల వల్ల వైసీపీకే అనుకూలమని అంటున్నారు. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో మూడు టీడీపీకి కాస్త ఎడ్జ్ లో ఉంటే నాలుగు సిగ్మెంట్ లలో వైసీపీ ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీకే అనుకూలంగా చెబుతున్నారు.

 

ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెడ్డి సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. ఆ తర్వాత బలిజ, ముస్లిం, స్వల్పంగా అక్కడక్కడా కమ్మ సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి. అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేది మాత్రం రెడ్డి, బలిజ, ముస్లిం, బీసీ, ఎస్సీ సామాజికవర్గం. రెడ్డి + ముస్లిం + ఎస్సీ కాంబినేషన్ ఉండటంతో వైసీపీకి బాగా కలిసి వచ్చే అంశం. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో వైసీపీకి కొంత ప్రతికూలతగా చెప్పుకుంటున్నా అది ఓట్ల రూపంలో కనబడుతుందా..? లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. గంటా నరహరి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ చేశారు. ఆ బహిరంగ సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు మంచి జోష్ వచ్చిందని అనుకున్నారు. దీపావళి టపాసులు కాలి ఆరిపోయినట్లుగా నెల రోజుల వ్యవధిలోనే టీడీపీ జోష్ ఆరిపోయింది. ఆ బహిరంగ సభ ద్వారా వచ్చిన జోష్ ను ఉపయోగించుకోవడంలో గంటా నరహరి ఫెయిల్ అయ్యారనే టాక్ నడుస్తొంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఉన్నాయి. అక్కడ టీడీపీ నాయకులే ఆ పార్టీని ఓడిస్తారు. దానికి ఇప్పటికీ టీడీపీ పరిష్కారం కనుక్కోవడం లేదు. అలాగే మదనపల్లి, రాయచోటి వైసీపీ కొంత బలహీన పడినా దాన్ని అందిపుచ్చుకోవడంలో టీడీపీ ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. ఇలా రాజంపేట నియోజకవర్గంలో పార్టీ పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా వైసీపీ బలంగా ఉంది. టీడీపీకి అంత ఈజీ కాదు అని తెలుస్తున్నా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆ పార్టీ ఫెయిల్ అవుతుందని అంటున్నారు. ఎన్నికల సమయానికి కాస్త బలం తగ్గినా వైసీపీకే ఎడ్జ్ ఉంటుందని భావిస్తున్నారు.

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసాల కేసులో హైకోర్టులో భిన్నమైన తీర్పులు

 


Share

Related posts

TTD: అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థానంగా శ్రీరామనవమి రోజు టీటీడీ నిర్ధారణ…నెరవేరుతున్న చిదంబర శాస్త్రి చిరకాల వాంఛ

somaraju sharma

Samantha: తన కొడుకు చైతన్య, కోడలు సమంతల విడాకుల గురించి మొట్టమొదటిసారి స్పందించిన నాగార్జున?

Ram

‘రాజధానికి 1500 ఎకరాలు చాలు’

somaraju sharma