NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rammohan : లోక్ సభ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే రామ్మోెహన్ నాయుడు 9 రోజులు సెలవు పెట్టారు..! ఎందుకో తెలుస్తే..?

Rammohan : కింజరపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన యువ పార్లమెంట్ సభ్యుడు. క్రమం తప్పకుండా లోక్ సభ సమావేశాలకు హజరయ్యే ప్రజా ప్రతినిధి. చిన్న వయసులోనే పార్లమెంట్ లో అత్యున్నత పనితీరు కనబర్చి సంపత్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ పార్లమెంట్ సభ్యుడు వారం రోజుల పాటు లోక్ సభకు సెలవు పెట్టారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలో పాల్గొనలేకపోతున్నా నంటూ లోక్ సభ స్పీకర్ ఓంబిల్లాకు లేఖ రాశారు. రామ్మోహన్ నాయుడు లోక్ సభ బడ్జెట్ సమావేశాలకు ఎందుకు సెలవు పెట్టారనే విషయం తెలిస్తే ఆయనను అభినందించారు.

Rammohan : Rammohan Naidu, who regularly attends Lok Sabha meetings, has been given 9 days leave ..! If you know why ..?
Rammohan Rammohan Naidu who regularly attends Lok Sabha meetings has been given 9 days leave If you know why

రామ్మోహన్ నాయుడు తండ్రి అయ్యారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు శనివారం పుత్రిక జన్మించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన భార్య ప్రసవ సమయం సమీపించిందనీ, తాను తండ్రిని కాబోతున్నాననీ కావున తనకు పితృత్వ సెలవు కావాలి అంటూ లోక్ సభ స్పీకర్ ఓంబిల్లాకు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు సెలవు చీటి పంపారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నాననీ, తరువాత పాల్గొంటానని లేఖలో పేర్కొన్నారు. తన భార్య ప్రసవానికి ఆ తరువాత ఆమె బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఓ భర్తగా, కాబోయే తండ్రిగా తన మీద ఉన్నాయని కావున ఈ తొమ్మిది రోజుల పాటు తన గైర్జజరీని పితృత్వ సెలవుగా పరిగణించాలంటూ విజ్ఢప్తి చేశారు. క్రమం తప్పకుండా సమావేశాలకు హజరయ్యే రామ్మోహన్ నాయుడు ఇలా స్పీకర్ కు లేఖ రాయడం ఆయన బాధ్యతను తెలియజేసినట్లు ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు తండ్రి కావడం పట్ల ఆయన బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తున్నారు.

రామ్మోహన్ నాయుడుకు 2017లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యతో వివాహం అయ్యింది. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రంనాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి తొలుత మంచి స్నేహితులు కాగా తరువాత వియ్యంకులు అయ్యారు. ఎర్రంనాయుడు మరణానంతరం రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం నుండి ఎంపిగా రెండు సార్లు గెలిచారు.
.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju