NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సొంత గూటికి చేరేందుకు ఆ టీడీపీ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలించేనా..!?

YSRCP: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తా చూపించలేకపోయింది. ఇక టీడీపీలో యాక్టివ్ గా ఉన్న మాజీ మంత్రులు, నేతలపై కేసులు నమోదు కావడం, అరెస్టులు చూస్తునే ఉన్నాం. రాజకీయంగా నియోజకవర్గాల్లో, జిల్లాలో చక్రం తిప్పినవాళ్లు నేడు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేసులు, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన టీడీపీ మాజీ మంత్రి తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి.

Rayalaseema Tdp Ex Minister Likely to join YSRCP
Rayalaseema Tdp Ex Minister Likely to join YSRCP

Read More: Nama Nageswararao: టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామాకు మరో సారి షాక్ ఇచ్చిన  ఈడీ..!!

2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  భూమా అఖిల ప్రియ వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. చంద్రబాబు పర్యాటక శాఖ మంత్రి పదవి ఇచ్చారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి టీడీపీ తరపున పోటీ చేసిన భూమా అఖిలప్రియ వైసీపీ ఫ్యాన్ గాలిలో పరాజయం పాలైయ్యారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం అఖిలప్రియ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ ఇబ్బందులు మాత్రమే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. ఇటీవల బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టు అయి జైలుకు కూడా వెళ్ళారు. అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు. ఆమె ఆ కేసులో అరెస్టు అయిన సమయంలో టీడీపీ ముఖ్యనేతలు ఎవరూ పరామర్శించిన దాఖలాలు లేవు. దీంతో ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారనీ, బెయిల్ పై బయటకు రాగానే   వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

Rayalaseema Tdp Ex Minister Likely to join YSRCP
Rayalaseema Tdp Ex Minister Likely to join YSRCP

అయితే ఇప్పుడు వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ పై స్పష్టమైన హామీ వస్తే ముందడుగు వేయాలని భావిస్తున్నారు. వైసీపీ పెద్దలతో ఇప్పటికే మంతనాలు కూడా ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉన్న మేన మామ ఎస్వీ మోహనరెడ్డి ద్వారా అఖిల ప్రియ మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. తమ కుటుంబానికి రాజకీయంగా పట్టు ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గ టికెట్ హామీ లభిస్తే నంద్యాల విషయంలో రాజీపడేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అఖిల ప్రియకు వైసీపీ నుండి స్పష్టమైన హామీ లభిస్తుందా? అఖిల ప్రియ విషయంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు ? అన్నది వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju