Reavanth reddy: రేవంత్ రెడ్డికే ప‌గ్గాలు… కాంగ్రెస్ లో నిర్ణ‌యం జ‌రిగిపోయిందా?

Share

Reavanth reddy: కాంగ్రెస్ పార్టీ లో గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ , ర‌చ్చ‌కు చెక్ పెడుతూ పీసీసీ చీఫ్ ఎంపిక విష‌యంలో కీల‌క నిర్ణ‌యం జ‌రిగిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌‌కు కుడి భుజంగా ఉన్న ఈటల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌‌ కావడం, వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమై పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడం, ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌‌ఎస్‌‌కు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోసం సిద్ధమవడంతో ఈ క‌స‌ర‌త్తుకు చెక్ పెట్టాల‌ని ఢిల్లీ పెద్ద‌లు డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం.

Read More: Eatela Rajendar: ఆ ఒక్క‌మాట‌తో లేచి… ఈట‌ల‌పై ఫైర‌వుతున్న క‌మ్యూనిస్టు పార్టీలు


ర‌చ్చ ర‌చ్చ‌…

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌ కుమార్ రెడ్డి చాలా రోజుల కిందటే తన పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో ఎవరినైనా నియమించమని అధిష్టానానికి లెటర్ రాశారు. పీసీసీ చీఫ్‌‌ ఎంపిక కోసం రాష్ట్ర ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ గాంధీభవన్‌‌లో మూడ్రోజులపాటు కసరత్తు చేసి సీనియర్లు, కోర్ కమిటీ మెంబర్లు, నియోజకవర్గ ఇన్‌‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు స్వీకరించారు. ఐదారుగురి పేర్లను పెద్దల పరిశీలనకు పంపినట్లు చెప్పారు. చివరి వడపోతలో జీవన్ రెడ్డి, రేవంత్‌‌రెడ్డి పేర్లు బలంగా వినిపించగా వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావ‌డం అక్కడి నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత జానారెడ్డి.. పీసీసీ ప్రెసిడెంట్ ఎంపికను ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని హైకమాండ్‌‌కు లెటర్ రాయ‌డం, ఢిల్లీ పెద్ద‌లు అలాగే చేయ‌డం తెలిసిన సంగ‌తే.

Read More: Eatela Rajendar: ఈట‌ల రాజీనామా ఎపిసోడ్ తో కాంగ్రెస్ లో క‌ల‌క‌లం…

రేవంత్ రెడ్డి కే చాన్స్‌…

అయితే, రేవంత్ రెడ్డి కే పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని నాలుగు రోజుల నుంచి పార్టీలో ప్రచారం ఊపందుకుంది. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌‌పై దేశవ్యాప్త కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీలకు ఏఐసీసీ సూచనలిచ్చింది. దీంతో నేతలంతా మళ్లీ జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే టైమ్‌‌లో మళ్లీ పీసీసీ అధ్యక్ష పదవిపై చర్చ మొదలైంది. అయితే, ఇదే స‌మ‌యంలో పార్టీలో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. మ‌రి ఈ ర‌చ్చ‌కు చెక్ పెట్టేలా ఢిల్లీ పెద్ద‌లు నిర్ణంయ తీసుకుంటారా? రేవంత్ కు పద‌వి ఇస్తారా? అంటే వేచి చూడాల్సిందే.


Share

Related posts

బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ..వీళ్ళంతా కాదు ఈ సారి సంక్రాంతి బరిలో దుగుతున్న మొనగాడెవరో తెలుసా..?

GRK

Kishan Reddy : తెలంగాణ , ఏపీ ప్ర‌జ‌ల‌ను ఓ రేంజ్‌లో బాధ పెట్టిన కిష‌న్ రెడ్డి?

sridhar

మంత్రి కొడాలి నోట బీజెపీ,జనసేన మాట..!!

Special Bureau