Renu Desai: ప్రేమలో పడ్డాను అంటూ అతని ఫోటో పెట్టిన రేణుదేశాయ్..!!

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. “బద్రి” సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రేణు ఆ తర్వాత జానీ సినిమా చేసి పవన్ తో జీవితం పంచుకొని కొన్ని సంవత్సరాల క్రితం విడిపోవడం అందరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లలు కలిగిన రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సమాజంలో జరిగే అనేక విషయాలు గురించి మాట్లాడుతూ పర్సనల్ లైఫ్ గురించి కూడా నెటిజన్లతో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటారు.

 Renu Desai: Renu Desai posted a photo of him saying he fell in love .. !!
Renu Desai: Renu Desai posted a photo of him saying he fell in love .. !!

అంత మాత్రమే కాక కెరియర్ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా తెలియజేస్తూ రేణు దేశాయ్ అనేక విషయాలు చెబుతూ ఉంటారు. ఇటువంటి తరుణంలో తాజాగా తాను ప్రేమలో పడినట్లు ఫోటో షేర్ చేసింది. ఇంతకీ రేణుదేశాయ్ ఎవరితో ప్రేమలో పడిందంటే ఆమె పెంపుడు కుక్కపిల్ల “ప్లూటో” తో. “నేను ఇప్పుడు దీనితో ప్రేమలో ఉన్నాను” అంటూ కుక్కపిల్ల ఫోటోను షేర్ చేసింది.

 

దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి లో ప్రేమలో పడ్డాను అనేటప్పటికి చాలా మంది రేణు సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసింది అని అందరూ భావించారు. తెర కుక్క ఫోటో చూసిన తర్వాత రేణు కూడా జంతు ప్రేమికురాలిని అర్థం చేసుకున్నారు. ఏది ఏమైనా రేణుదేశాయ్ ప్రేమలో పడ్డాను అనే వార్త సోషల్ మీడియాలో వచ్చే సరికి పవన్ అభిమానులు ఒక్కసారిగా కంగారు పడిపోయినట్టయింది. గతంలో రేణు రెండో పెళ్లి అనే వార్త పెట్టినప్పుడు.. అనేక వైరల్ పోస్ట్లు ఆమె పెట్టడం జరిగింది. కొంతమంది బెదిరింపులకు కూడా దిగుతూ రేణుదేశాయ్ ని అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఇలాంటి తరుణంలో తాజాగా రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారటం జరిగింది.