NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇలా .. ట్విస్ట్ ఏమిటంటే..?

Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. ఏపిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రాజ్ భవన్ లో వేడుకలను నిర్వహించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి,  పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వ పథకాలు బేష్ అంటూ ప్రసంగించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠంపై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

Republic Day Celebration telangana Andhra Pradesh Differences

 

మరో పక్క తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్ భవన్ వేదిగా నిర్వహించారు. గవర్నర్ తమిళి సై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రులు గైర్హజరు అయ్యారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితర ఉన్నతాధికారులు మాత్రం హజరైయ్యారు.  తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య వార్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు మరో సారి రుజువు అయ్యింది. ఇక్కడ గవర్నర్ తమిళి సై తన ప్రసంగంలో సీఎం కేసిఆర్ సర్కార్ పరోక్షంగా విమర్శించారు. సీఎం కేసిఆర్ కు చురకలు అంటేలా మాట్లాడారు. హైదరాబాద్ లో రిపబ్లిక్ డే ముగిసిన వెంటనే గవర్నర్ తమిళి సై.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. కరోనా పరిస్థితుల మూలంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్ భవన్ లోనే  నిర్వహించాలని వారం రోజుల క్రితమే ప్రభుత్వం లేఖ రాసింది. కోవిడ్ పరిస్థితులు అంటూ ప్రభుత్వం చెప్పడాన్ని తెలంగాణ హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది. కోవిడ్ ఆంక్షలు ఎక్కడ ఉన్నాయంటూ కూడా ప్రశ్నించింది.

ఏపిలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య అప్యాయంగా పలకరింపులు, ప్రభుత్వ పరిపాలనా తీరును ప్రశంసిస్తూ గవర్నర్ ప్రసంగం ఉండగా, తెలంగాణలో వేడుకలకే ముఖ్యమంత్రి గైర్హజరు కావడం, గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం గమనార్హం.

Padma Awards 2023: ఏపి నుండి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు, వారి విజయాలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!