NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Chalo Vijayawada: ‘చలో విజయవాడ’పై ఉత్కంఠ..! జిల్లాల్లో ఆంక్షలు.. అరెస్టులు

TDP Strategy Failure: Babu Big Mistake in this..!?

Chalo Vijayawada: పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేస్తూ.. కార్యక్రమానికి వెళ్లొదని నోటీసులు జారీ చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఉద్యోగులను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్ల చిరునామాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా.. విజయవాడ వెళ్లే వారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

restrictions for chalo vijayawada
restrictions for chalo vijayawada

అన్ని జిల్లాల్లో..

కృష్ణా జిల్లాలోని నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లోని ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి కార్యక్రమానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. నాయకులు పోలీస్ స్టేషన్ రావాలని నందిగామ డీఎస్పీ కోరారు. గుంటూరు జిల్లాలో కూడా పోలీసుల ఆంక్షలు విధించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు ఫోన్లు చేసి కార్యక్రమానికి వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. అయితే.. ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న రాత్రికే విజయవాడకు చేరుకున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు ఎన్జీవో అధ్యక్షుడు కామిశెట్టి రాంబాబును గృహనిర్భంధం చేశారు. తుని జాతీయ రహదారిపై చెక్​పోస్టు ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల నాయకులను విజయవాడకు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు.

ఉద్యోగులను హౌస్ అరెస్ట్..

చలో విజయవాడకు అనుమతి లేదని విశాఖ జిల్లా ఉద్యోగులకు సమాచారం ఇస్తున్నారు పోలీసులు. విజయనగరంలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టి.. బొబ్బిలిలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరిని గృహ నిర్బంధం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. కొవిడ్ దృష్ట్యా విరమించుకోవాలని పోలీసులు సూచించారు. చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతల ఇళ్లకు వెళ్లి గృహనిర్బంధం చేశారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు, వాకాడు, వరికుంటపాడులో నేతలను ముందస్తు అరెస్టు చేశారు. పీఆర్సీ సాధన సమితి నేత చేజర్ల సుధాకర్​రావు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సర్వత్రా ఉత్కంఠ..

అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో పోలీసుల మోహరించారు. బుక్కరాయసముద్రం, నార్పల క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హిందూపురంలో ఎన్జీవో నేత నరసింహులును గృహనిర్భంధం చేశారు. ప్రకాశం జిల్లాలో చలో విజయవాడకు వెళ్తున్న ఉద్యోగ సంఘాలకు కొవిడ్‌ నిబంధనలు ఉన్నందున అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శరత్‌ను ఒంగోలులో గృహనిర్బంధం చేశారు. మొత్తంగా ప్రభుత్వం ఆంక్షలు, పోలీసుల ముందస్తు చర్యలతో రేపటి కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

author avatar
Muraliak

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?