Janasena: ఏపిలో ఎన్నికల సీజన్ వచ్చినట్లుగానే కనబడుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ జనాల్లోకి వెళుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడు బాదుడు, మిని మహానాడు పేరుతో జిల్లా పర్యటనలు చేస్తుండగా, గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తొంది. మరో పక్క బీజేపీ సమావేశాలను నిర్వహిస్తొంది. ఇదే క్రమంలో కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. విజయదశమి నుండి జనాల్లోనే ఉంటానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో జనసేనలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపి కేడర్ కు చెందిన విశ్రాంత ఐఎఎస్ అధికారి దేవ వరప్రసాద్ ఇవేళ జనసేన పార్టీలో చేరారు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన దేవ వరప్రసాద్ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వరప్రసాద్ ఏపి ప్రభుత్వంలో పలు హోదాల్లో 30 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. వరప్రసాద్ చేరిక కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసి) చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో జనసేన నుండి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గం రాజోలు. అక్కడ నుండి జనసేన తరపున ఎమ్మెల్యే గా గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు వరప్రసాద్ చేరికతో జనసేనకు ఆ నియోజకవర్గానికి మంచి అభ్యర్ధి దొరికినట్లు అయ్యింది. పార్టీ నుండి గెలిచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్ కు రాబోయే ఎన్నికల్లో గట్టి షాక్ ఇవ్వాలన్న కృత నిశ్చయంతో జనసైనికులు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ కు వైసీపీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో మొదటి నుండి ఆ పార్టీ లో ఉన్న కొందరు నేతలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…