NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pegasus: పెగాసెస్ గందరగోళంపై లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ హాట్ కామెంట్స్

Pegasus: పెగాసెస్ స్పైవేర్ నిఘా అంశం ఇప్పుడే దేశంలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. దేశంలో 300లకు పైగా ప్రముఖుల ఫోన్ లపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం తీవ్ర సంచలనం అయ్యింది. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధాన అంశాలపై చర్చ జరగకుండా సభలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలకు సంబంధించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు.

retd ias Jayaprakash Narayana comments on Pegasus
retd ias Jayaprakash Narayana comments on Pegasus

పాలకపక్షాలు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఇది కొత్త ఏమి కాదన్నారు. నిఘాకు చట్టబ్దదంగా కట్టుబాట్లు ఉండాలి. న్యాయవ్యవస్థ నుండి ముందస్తు అనుమతులు తీసుకుని కొన్ని చట్టబద్ద  పద్ధతులు పాటించాల్సి ఉంటుందన్నారు. పాలనలో ఉన్న అన్ని పార్టీలు ఏ రకమైన న్యాయపరమైన అనుమతులు లేకుండా చట్టంతో నిమిత్తం లేకుండా ఇష్టం వచ్చినట్లు వేలాది ఫోన్ల మీద నిఘా వేస్తున్నారని అన్నారు. పూర్వంతో పోలిస్తే టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి నిఘా వేసే పద్దతులు మరింత బలపడ్డాయన్నారు. నిఘా వేయడంతో మరింత పట్టు ఉన్న పద్ధతులు ఇప్పుడు దొరికాయన్నారు. ప్రభుత్వాలు నేరాలను అరికట్టడానికి, దేశ సమగ్రత కాపాడటానికి ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి లేకుంటే అరాచకత్వం వస్తుంది. ఇదే సమయంలో వ్యక్తుల స్వేచ్చను హరించకుండా అధికార దుర్వినియోగం లేకుండా జవాబుదారి తనంతో వ్యవహరించాలన్నారు. న్యాయవ్యవస్థ నిరంతరం పరిశీలించి స్పష్టమైన ఆధారాలతో చట్టంలో ఏ ఏర్పాట్లు ఉన్నాయి, వాటిని పాటిస్తున్నామా లేదా వాటికి ఎలాంటి చట్టాలను ఏర్పాటు చేద్దాం అనే వాటిపై  చర్చ జరిగితే సంతోషించవచ్చని అన్నారు. ఇటువంటి చర్చ జరపడానికి అధికార పక్షానికి ఇష్టం లేదు, ప్రతిపక్షానికి ఇష్టంలేదనీ, నీవు చేశారు కదా అంటే నీవు చేశావు కదా అంటూ ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఎదో ఒక సమస్యను పట్టుకుని పది రోజుల పాటు గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

దేశంలో కీలకమైన సమస్యలను విస్మరించి సామాన్యులకు అర్థంకాని పెగాసెస్ ను పట్టుకుని పది రోజుల పాటు  ఆందోళనలు చేయడం వల్ల ఎటువంటి లాభం ఉండదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని ఎలా బాగు చేయాలి, గత ఏడాది తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంపై జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏలా అమలు చేయాలి, అదే విధంగా ఆర్థిక వ్వసస్థ కూదేలైపోయింది, పెట్టుబడులు పెంచాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి కావావి తదితర కీలక అంశాలపై ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలి కానీ ఇలా ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం తిట్టుకోవడం సరికాదని జయప్రకాష్ నారాయణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!