Revanth Reddy: ఇటు రేవంత్ అటు ష‌ర్మిల‌… సంచ‌ల‌న నిర్ణ‌యం

Share

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ‌లో రాజ‌కీయ అరంగేట్రం చేసి వ‌డివ‌డిగా త‌న కార్యాచ‌ర‌ణ ముందుకు తీసుకువెళ్తున్న వైఎస్ ష‌ర్మిల కీల‌క స‌మ‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రి ముందు కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యం ఎంపి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం అందేలా ఏర్పాట్లు చేశామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తాం..5 రూపాయలకే భోజనమని పేర్కొన్నారు.

ష‌ర్మిల కీల‌క నిర్ణ‌యం…

కరోనా బాధితులను అదుకునేందుకు “ఆపదలో తోడుగా YSSR”అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. “తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం కోల్పోకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి .. మళ్ళి మీ జీవితం సాఫీగా సాగేందుకు..మీరంతా మన YSR కుటుంబసభ్యులుగా భావించి ..నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకొంటున్నాను. మన “ఆపదలో తోడుగా YSSR టీం” ఫోన్ నంబరు 040-48213268 కు మీ సమాచారాన్ని తెలియజేయండి తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు. కుటుంబ పెద్దదిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనాకు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు చేస్తున్నాను” అంటూ షర్మిల తెలిపారు.

తెలంగాణ‌లో ఇదీ ప‌రిస్థితి…

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది.


Share

Related posts

రేపే రంజాన్

somaraju sharma

Tirupati : తిరుపతి తీరే వేరయా! 19 ఏళ్ల తర్వాత ఎన్నికలు!

Comrade CHE

YSRCP : తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ…ఎవరంటే..

somaraju sharma