NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

revanth reddy : ద‌టీజ్ రేవంత్ రెడ్డి…. ఇటు కేసీఆర్ అటు కాంగ్రెస్ నేత‌ల‌కు అదిరిపోయే షాక్‌

Revanth reddy : రేవంత్ రెడ్డి… కాంగ్రెస్‌ ఎంపీ, తెలంగాణ లో ఉన్న ఫైర్ బ్రాండ్ నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. త‌న స‌హ‌జ‌సిద్ద దూకుడుకు కొన‌సాగింపుగా రాజీవ్ రైతు భరోసా దీక్షను పాదయాత్రగా మార్పు చేశారు.

revanth-reddy-double-shock-at-same-time
revanth-reddy-double-shock-at-same-time

అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుస్తున్నా..అధిష్టానం సూచనతోనే పాదయాత్ర చేస్తున్నానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పాదయాత్రలతో రైతుల వద్దకు వెళ్లాలని అదిష్టానం పంపిన నోట్ బయటపడడంతో నేతలు చల్లబడ్డారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మ‌ళ్లీ బీపీ పెంచే ప్ర‌య‌త్నం చేశారు.

Revanth reddy  రేవంత్ స్టైలే వేరు…

వివిధ అంశాలపై అధికార పార్టీని, సీఎంను, మంత్రులను ఇలా అందరినీపై డైరెక్ట్‌గా ఫైర్ బ్రాండ్ రేవంత్ ఎటాక్ చేస్తుంటారు. ఏ విషయంలోనైనా నిలదీయడంలో ముందుంటారు. ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్‌లో రేవంత్ రెడ్డి ఉన్నాడన్న చర్చ సాగుతోన్న సమయంలో.. ఆయ‌న పాదయాత్ర మొద‌లుపెట్టారు. అయితే, రేవంత్ పాదయాత్రవైపు ఉత్తం, భట్టి, కోమటిరెడ్డి బ్రదర్స్, విహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మ‌రోవైపు…రేవంత్ పాదయాత్ర ఫెయిల్యూర్ అంటూ హైకమాండ్‌కు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌ పాదయాత్రలో జనాదరణకు..పార్టీ నేతల ఫిర్యాదులకు పొంతన లేకపోవడంతో ఢిల్లీ నేతలు అవాక్కయ్యార‌ట‌.

ఢిల్లీ పీఠం తో షాక్ ఇచ్చిన రేవంత్

రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుపులు వినిపిస్తున్న స‌మ‌యంలో అదిష్టానం పంపిన నోట్ బయటపడింది. దీంతో నేత‌లు సైలెంట్ అయ్యార‌ట‌. పాదయాత్ర ముగింపులో ఈనెల 16న రావిర్యాలలో రేవంత్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేవంత్ సభకు పార్టీలో ముఖ్య నేతలు ఎవరెవరు హాజరవుతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కేసీఆర్ కు సైతం….

మ‌రోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల హామీ ఇంకా అమలు కాలేదని ఈ లేఖ లో రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు హామీ రెండేళ్లయినా అతిగతీ లేదని మండిపడ్డారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిలలను గుర్తించి తక్షణమే పింఛన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా లక్షలాది మంది అర్హులు పెన్షన్లకు దూరమయ్యారని.. పెన్షన్లకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఎన్యూమరేషన్‌ చేయించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

author avatar
sridhar

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju