Road Accident: ఏపిలోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలం నర్సాపురానికి చెందిన 23 మంది కూలీలు ఆటోలో ఏపిలోని గురజాల మండలం పులిపాడు గ్రామానికి వెళుతుండగా, వీరు ప్రయాణిస్తున్న ఆటోను దాచేపపల్లి మండలం పొందుగుల వద్ద లారీ ఢీకొట్టింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వివేకా హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ .. మరో సారి సునీత దంపతులను విచారించిన సీబీఐ