ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇవాల్టికి ఇదే హై లైట్ న్యూస్ : భోరున ఏడ్చిన రోజా – చలించిపోయిన జగన్ ?

Share

ఏపి Andhra Pradesh రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న చిత్తూరు జిల్లా వైసీపీ ycp ఎమ్మెల్యే ఆర్కే రోజా roja నేడు తనకు అవమానం జరుగుతోందంటూ బోరున విలపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ tdp అధినేత చంద్రబాబు chandra babuతో సహా ఆ పార్టీ నేతలను విమర్శలతో చెడుగుడు ఆడేసే రోజా సొంత పార్టీ నేతల తీరుతోనే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తనకు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

roja lamented in front of the privilege committee that no one is caring about her as mla

చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి సమక్షంలోనే కన్నీళ్ల పర్యంతం అవుతూ తన ఆవేదనను వ్యక్త పరిచారు. అధికారులు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, అధికార కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదనీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన నియోజకవర్గ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలకు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదనీ రోజా ఆరోపించినట్లు తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్యే రోజా ఆరోపణలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందిస్తూ..ప్రోటోకాల్ విషయంలో ఏ ఎమ్మెల్యేకు అవమానం జరిగినా తాము చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభా హక్కులు కాపాడటంలో అధికార, ప్రతిపక్షం అన్న లేడాలు ఏమీ ఉండవని కాకాణి పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజా ఓ రోడ్డు విషయంలో అధికారులు స్పందించడం లేదని మాత్రమే ఫిర్యాదు చేశారనీ, ఆయితే ఆ అంశం తన పరిధిలోనిది కాకపోయినా కలెక్టర్ తో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

అయితే నగరి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పలు పరిణామాలపై రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండా మంత్రులు, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు తన నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడంతో గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో ఇటీవల డిప్యూటి సీఎం నారాయణస్వామితో రోజాకు మాటలు యుద్ధం కూడా జరిగింది. అయితే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. రోజా మనస్థాపంతో కన్నీళ్లు పెట్టుకున్న విషయం ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ చలించిపోయారని అంటున్నారు. అక్కడ జరుగుతున్న వ్యవహారలపై పూర్తి సమాచారాన్ని జగన్ కోరారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..బిగ్ బ్రేకింగ్ : భూమా అఖిలప్రియ కి జీవిత ఖైదు ??


Share

Related posts

బాలకృష్ణ సినిమాలో పవన్..??

sekhar

తాళజ్ఞాని

somaraju sharma

బిగ్ బాస్ టైటిల్ గెలిచాక వరుస ఆఫర్లు అందుకుంటున్న అభిజిత్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar