NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: సకల శాఖల మంత్రి..? సజ్జలపై ఎంపి రఘురామ సెటైర్..!!

RRR: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏ సమస్యపైనా వెంటనే స్పందించేది ఎవరు అంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  ఏ శాఖకు సంబంధించిన సమస్య అయినా ముందుగా ఆయన స్పందిస్తారు. ఆయన హామీ ఇస్తే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే, సమస్య పరిష్కారం అయిపోతుంది. గత కొన్నాళ్లుగా అనేక విషయాలపై ఆయా శాఖల మంత్రుల కంటే ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపైనా వెంటనే ఆయన స్పందిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలు చేస్తూ ఆరోపణలను ఖండిస్తున్నారు. రాజకీయ విమర్శలు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు, పార్టీ నేతలతో మంతనాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించి వ్యవహారాలు ఇలా అన్ని విషయాల్లోనూ సజ్జల పనితీరు కనబడుతోంది.

RRR comments on sajjala rama krishna reddy
RRR comments on sajjala rama krishna reddy

RRR: జోడు పదవుల్లో బిజీగా సజ్జల

సజ్జలకు ఓ పక్క పార్టీ పరంగా ప్రధాన కార్యదర్శి హోదా ఉంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సలహాదారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఈ కారణంగా అన్ని విషయాలను ఆయన చక్కబెడుతున్నారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి, బొగ్గు కొరత కారణంగా ఏర్పడుతున్న విద్యుత్ సమస్యలపై ఆయా శాఖల కంటే ముందుగానే సజ్జల మీడియా సమావేశాల్లో మాట్లాడారు. తాజాగా ఇటీవల ఉద్యోగుల సమస్యలపైనా ఆయా సంఘాల నేతలతో సీఎంఓలో సమావేశం నిర్వహించి వారికి పిఆర్సీ తదితర విషయాలపై హామీ ఇచ్చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల యాక్టివ్ రోల్ పోషిస్తుండటంతో ప్రతిపక్ష నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

RRR: రేపో మాపో సజ్జల మంత్రి

తాజాగా వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు సజ్జలపై సెటైర్ వేశారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేపో మాపో సజ్జల మంత్రి అవుతారనీ, అప్పుడు ఆయన ఒక మంత్రిత్వ శాఖను మాత్రమే చూస్తారా లేక సకల శాఖలను చూస్తారా అని ప్రశ్నించారు. మరో పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా విమర్శించారు రఘురామ కృష్ణంరాజు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రూ.2.87 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. ప్రభుత్వ  ఖజానాలోని రూ.1.31 లక్షల కోట్లకు లెక్కలు కూడా తేలడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పులపై పూర్తి వివరాలను తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read More: MAA: మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ కీలక లేఖ..! ముదురుతున్న వివాదం..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju