RRR Episode: ఆర్ఆర్ఆర్ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పెద్ద చిక్కొచ్చిపడిందే..!?

Share

RRR Episode: పార్టీ దిక్కార ఎంపిల అనర్హత విషయంలో స్పీకర్‌లు తీసుకునే నిర్ణయమే కీలకం అని అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ కేసు విషయంలో సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయాధికారాలను ప్రశ్నించలేమని తెలిపింది. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ముందు ముగ్గురు ఎంపిలకు సంబంధించిన అనర్హత పిటిషన్ లు ఉన్నాయి. ఒకటి ఏపికి చెందిన నర్సాపురం వైసీపీ ఎంపి రఘురామ కృష్ణం రాజుకి చెందినది కాగా రెండు పశ్చిమ బెంగాల్ టీఎంసీకి చెందిన టీఎంసీ ఎంపి లవి. రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీని వీడి వేరే పార్టీలో అయితే చేరలేదు కానీ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను, సీఎం జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

RRR Episode lok sabha speaker ombirla
RRR Episode lok sabha speaker ombirla

ఏడాది క్రితమే రఘురామపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు పిటిషన్ అందజేశారు. పలు మార్లు విన్నవించారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే బలమైన అధారాలతో ఇటీవల మరో పిటిషన్ అందజేశారు. నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోకుంటే లోక్ సభలో ఆందోళన చేస్తామని కూడా వైసీపీ ఎంపీలు హెచ్చరించారు. అయితే రఘురామపై చర్యలు తీసుకోవాలంటే దీనితో పాటు ఉన్న టీఎంసీ ఎంపిల అనర్హతపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరు టీఎంసీ ఎంపిలు అనధికారికంగా బీజేపీలో చేరారు. ఇటీవల ఎన్నికల సమయంలో హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి ర్యాలీలోనూ పాల్గొన్నారు.

ఒక వేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ముగ్గురు ఎంపిలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ముగ్గురి అనర్హత పిటిషన్ లను పెండింగ్ లోనే ఉంచాల్సి ఉంటుంది. బీజేపీ పక్షాన చేరిన ఇద్దరు టీఎంసీ ఎంపిలపై చర్యలు తీసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ అంగీకరిస్తుందా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్పీకర్ ఓంబిర్లా రఘురామ కృష్ణంరాజుతో పాటు ఇద్దరు టీఎంసీ ఎంపిలకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల లోగా సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ ఎంపిలు ఇచ్చే సమాధానంపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంపిల అనర్హత పిటిషన్ల విషయంలో బీజేపీ చక్రం అడ్డం వేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.


Share

Related posts

Bank Holidays : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..

bharani jella

బ్రెక్సిట్ బలి కోరింది!

Siva Prasad

ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా కీర్తి సురేష్ మనసు ఆ ఒక్క సినిమాదే ఉందంటే ఆ కథ రేంజ్ ఏంటో అర్థమవుతుంది ..!

GRK