NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: ఏపి సీఐడీ ఇచ్చిన షాక్ తో నర్సాపురం టూర్ రద్దు చేసుకున్న రఘురామ ..రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి..

RRR: ఏపి సీఐడీ ఇచ్చిన షాక్‌తో వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నర్సాపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీలో న్యాయవాదులతో మంతనాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. విషయంలోని వెళితే..త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లాలని భావించారు. ఆ క్రమంలో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన నియోజకవర్గంలోకి వస్తున్నందున తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు.

 

RRR: సీనియర్ న్యాయవాదులతో చర్చలు

అయితే ఏపి సీఐడీ అధికారులు నిన్న హైదరాబాద్ లోని రఘురామ నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణ కు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇంతకు ముందు రాజద్రోహం తదితర సెక్షన్ల కింద రఘురామను ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, ఆ తరువాత ఆయను సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత ఆ కేసుకు సంబంధించి విచారణకు హజరుకావాలని సీఐడీ నోటీసులు జారీ చేయడంతో విచారణకు హజరు అవుతానని వెల్లడించిన రఘురామ.. హుటాహుటిన హైదరాబాద్ నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ఈ నోటీసుల అంశంపై ఆయన డిల్లీలో సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

cid notice to mp raghuramakrishna raju

నర్సాపురం పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో అభిమానులు, నేతలు ఎవ్వరూ ఎయిర్ పోర్టు వద్దకు రావద్దంటూ రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నందున నియోజకవర్గ పర్యటన వాయిదా వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మరో పక్క ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ పై రఘురామ కృష్ణంరాజు కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ పలువురు ఆందోళన నిర్వహించారు. రఘురామ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణలను రఘురామ ఖండించారు.

 

 

 

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N