NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RUIA Deaths: రూయా ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్ ..! వాస్తవ లెక్కలు బయటకు వచ్చేనా..?

RUIA Deaths: ఈ నెల 10వ తేదీన తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారని అధికారులు వెల్లడిస్తుండగా ఎక్కువ మందే మృతి చెందారని ప్రచారం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల వంతున తక్షణ సహాయం మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఓ పక్క హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది.

RUIA Deaths  NHRC issued Notice
RUIA Deaths NHRC issued Notice

ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి చింతా మోహన్‌తో పాటు సుధాకర్ ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన మూడు రోజుల వరకూ ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. ఆసుపత్రి వర్గాలు మాత్రం మొత్తం మృతుల జాబితాను విడుదల చేశాయి. మానవ తప్పిదం వల్లే రూయాలో 30 మంది చనిపోయారని ఫిర్యాదు అందడంతో ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్ అయ్యింది.  ఘటనలో 30 మంది వరకూ చనిపోయారన్నది నిజమైతే తీవ్ర మానవ హక్కుల ఉలంఘన అవుతుందని ఎన్‌హెచ్ఆర్‌సీ అభిప్రాయపడింది. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదిక అందించాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి స్పష్టం చేసింది. రూయా ఘటనపై ఓ పక్క హైకోర్టులో విచారణ జరగడం, మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం కేసు స్వీకరించి వివరణ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఘటన జరిగిన రోజు 20 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు రోగుల కుటుంబ సభ్యులు చెబుతుండగా, అయిదు పది నిమిషాల్లోనే ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ జరిగిందని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju