chandrababu : చంద్ర‌బాబును జ‌నాలు మ‌ర్చిపోయార‌నేందుకు తాజా ఉదాహ‌ర‌ణ ఇదే

23 number continuing for chandrababu naidu
Share

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కెరీర్‌లో ఆయ‌న పేర్కొన్న‌ట్లుగానే దారుణ‌మైన నిర్ణ‌యం తీసుకున్న సంద‌ర్భం ఇది. ఏపీలో హోరాహోరీగా జ‌రుగుతున్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అనూహ్య రీతిలో తెలుగుదేశం పార్టీ బ‌రిలో ఉండ‌టం లేదంటూ చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ప్రధాన ప్రతిపక్షం వైదొలిగినా..తాము ఎన్నికలను ఎదుర్కొంటామని జనసేన, బీజేపీ ఎన్నికల బరిలో ఉన్నట్టు ప్రకటించాయి. వామపక్షాలు కూడా ఇదే మాట మీద ఉన్నాయి. త‌ద్వారా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌దిలో నుంచి చెరిగిపోయే చాన్స్ స్వ‌యంగా ఇచ్చార‌ని విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు.

sad news to chandrababu
sad news to chandrababu

ఇది మొత్తంగా ట్రెండ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటలకు మొద‌లైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. స్టే వచ్చినా ఎన్నికల ఏర్పాట్లు ఎక్కడా ఆపక పోవడంతో అనుకున్న సమయానికి సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. మొత్తం రెండున్నర కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కు కొద్ది గంటల ముందు వరకు ఉత్కంఠ రేపిన ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్క‌డంతో కోర్టు ఆదేశాలతో యధావిధిగా పోలింగ్ జరుగుతోంది.

వైసీపీ హ‌వా ఖాయ‌మే…

ఏపీలో ప్ర‌స్తుతం మొత్తం 515 జడ్పిటిసి స్థానాలకు, 7220 ఎంపిటిసి స్థానాలను పోలింగ్ జరుగుతోంది. 515 జడ్పిటిసిల్లో 126 ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఎంపిటిసిల్లో 2371 ఏకగ్రీవం అయ్యాయి. అవి పోను మిగిలిన స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దీని కోసం 27 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా…జడ్పిటిసి,ఎంపిటిసి కలిసి 20 వేల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే, ఏకగ్రీవాలు, వరుస విజయాలతో వైసీపీ జోరు మీద ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం ఏకపక్షం అని చెబుతోంది. ఇప్పటికే టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఏకగ్రీవాలు అక్రమం అంటూ ఆ పార్టీ లైన్ తీసుకుంది. అయితే, పోలింగ్ ద‌శ‌లోనే టీడీపీని ప్ర‌జ‌లు మ‌ర్చిపోయేలా చంద్ర‌బాబు నిర్ణ‌యం ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Related posts

ఈ సంవత్సర చివరిలో…! హిమాలయాలకు తప్పని ముప్పు…!!

Special Bureau

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

somaraju sharma

Aacharya release date : చిరంజీవి ఆచార్య విడుదల డేట్ వచ్చేసింది – మిగితా హీరోలు బహుపరాక్

bharani jella