NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సంచలన ఆరోపణలు చేసిన సజ్జల..

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై కొందర రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో వివేకా హత్యలో భారీ కుట్రకోణం దాగి ఉందనీ, దాన్ని వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంటూ వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి తదితరుల పేర్లు కూడా ప్రస్తావించింది. చార్జిషీటులోని అంశాలను పలు  మీడియాల్లో రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

YS Viveka Murder Case: చార్జిషీటు పేరుతో తప్పుడు ఆరోపణలు

చార్జిషీటు పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ, అప్పుడు కుట్ర చేశారనీ, ఇప్పుడు అంతకంటే ఎక్కువ కుట్ర చేస్తున్నారని సజ్జల అన్నారు. బాధితులనే నిందితులుగా చేసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీటును కఛ్చితంగా ఛాలెంజ్ చేస్తామని అన్నారు. ఈ హత్య కేసులో వాస్తవాలు తెలియాలన్నారు. వివేకా హత్య కేసులోకు సంబంధించి సీబీఐ చార్జిషీటు హేతుబద్దంగా లేకుండ కథనంగా ఉందనీ, చార్జిషీటులో సంబంధం లేని వ్యక్తులపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి జెంటిల్మెన్ అని పేర్కొన్న సజ్జల, హత్య జరగకముందు అవినాష్ రెడ్డికి మద్దతుగా వైఎస్ వివేకానందరెడ్డి ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

వివేకా హత్య వెనుక టీడీపీ హస్తం..?

తనకు టికెట్ దక్కదన్న అక్కసుతోనే అవినాష్ రెడ్డి వైఎస్ వివేకాను హత్య చేశారని ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య జగన్ ను బాగా కుంగదీసిందని అన్నారు. మార్చి 15న హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని సజ్జల గుర్తు చేశారు. చార్జి షీటు పేటుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటేనని విమర్శించారు. వివేకా హత్య వెనుక టీడీపీ హస్తం ఉండి ఉంటుందనీ, సీబీఐ చార్జిషీటు చూసిన తరువాత అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని అన్నారు సజ్జల.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju