Sajjala Rama Krishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి తీవ్ర విమర్శలు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రజల తరపున మాట్లాడుతున్నామన్న పేరుతో ప్రతిపక్షం అనబడే, అరాచకశక్తుల మూక.. చంద్రబాబు నాయకత్వంతో పని చేస్తున్నారని విమర్శించారు. ఒక పద్ధతి, స్కీమ్ ప్రకారం తండ్రీ, కొడుకు, దత్తపుత్రుడు.. వీరు ముగ్గురూ వేర్వేరుగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు.
ప్రతిపక్షంగా ఉన్న పార్టీ.. తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పుకుని, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేస్తామని చెప్పుకోవాలి కానీ క్యారెక్టర్ అస్సాసినేషన్, రెచ్చగొట్టే ప్రసంగాలు, పచ్చి అబద్దాలతో కూడిన బూతులు మాట్లాడడం.. ముందుకు తోసుకు రావడం, ఎక్కడైనా పోలీసులు ఆపితే చొక్కాలు చింపి గొడవ చేయడం. ఇదే వారి పనిగా మారిందని విమర్శించారు. మాకు ఏ చట్టంతో సంబంధం లేదు. మేము ఏదైనా చేయొచ్చు. మమ్మల్ని ప్రశ్నిస్తే ఇల్లు ఎక్కి అరుస్తాం అన్నట్లు చేస్తున్నారన్నారు. సినిమాల్లో డైలాగ్‌లకు ప్రేక్షకులు ఈలలు వేసి, గోల చేసినట్లుగా.. సభల్లో అభిమానుల నుంచి అదే స్పందన రాగానే.. రెచ్చిపోవడం పవన్‌కళ్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు. అభిమానులు కొడుతున్న చప్పట్లు, చేస్తున్న కేరింతలకు.. రాబోయే ఎన్నికలకు ఏ సంబంధం ఉండదన్నారు. ఎందుకంటే ఆయన మాటల్లో పూనకం, అరుపులు, తిట్లు తప్ప విషయం ఉండదని అన్నారు.
పవన్‌కళ్యాణ్ యజమాని చంద్రబాబు నాయుడు వేషాలు మరీ అన్యాయంగా ఉన్నాయన్నారు. అంగల్లు, పుంగనూరులో ఏం జరిగిందో అందరం చూశారన్నారు. అంగల్లు వద్ద పోలీసులపై దాడి జరిగితే చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా ఒక పోలీస్ కళ్లు పోయాయన్నారు. అక్కడ పోలీసులు సంయమనం పాటించకుండా కాల్పులు జరపాలనీ, అందులో తమ వాళ్లు కొందరు చనిపోయాలి. దాంతో ప్రభుత్వంపై యుద్ధం చేయాలి. నానా రభస చేసి, దేశమంతా అప్రతిష్ట పాల్జేయాలన్నది చంద్రబాబు కుట్ర అని సజ్జల అన్నారు. ఈ కుట్ర జరగక పోవడంతో. కొత్తగా మరో కుతంత్రానికి తెర లేపారన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని, ఇక్కడ దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ.. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారన్నారు. గతంలో సీబీఐ రాష్ట్రంలోకి రానివ్వబోమన్న చంద్రబాబు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కోరుతున్నాడని విమర్శించారు.
అధికారం పోయాక చంద్రబాబు ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు సజ్జల. చంద్రబాబుకు ‘మెగలో మానియాక్’ అనే జబ్బు వచ్చినట్లుందన్నారు. అధికారం నా హక్కు. నా సొంతం అనుకోవడంతో పాటు, తనకు మించిన అర్హులు లేరని భావించడం, దాంతో అహంకారం పెంచుకోవడం.. ఆ అధికారం పోతే ఒక ఉన్మాదిలా మారడం ఆ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. ఆ లక్షణాలు చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
రుషికొండకు వెళ్లిన పవన్ పిచ్చి విమర్శలు చేశారన్నారు. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోయిన పవన్‌కళ్యాణ్ ఓటమికి గల కారణాలు వెతుక్కుని సరి చేసుకునే ప్రయత్నం చేయడం లేదనీ, ఆయనకు గెలుపు ముఖ్యం కాదని అన్నారు. పవన్ కేవలం చంద్రబాబు కోసమే పని చేస్తూ రాజకీయాలు నడుపుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు మాదిరిగా మెగలో మానియాక్ నుంచి దాటిపోయి ఫిజియో ఫ్రీనియా వచ్చిందేమోనని సెటైర్ వేశారు. మేము చేసేదే చెప్పాం. చెప్పింది చేశాం. పేదలకు అండగా ఉంటున్నాం. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా ఉంటున్నాం. అందుకే వారు ఆదరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవద్దు. వాస్తవాలు గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సజ్జల.
దమ్ముంటే బాబు కోసమే పనిచేస్తున్నానని షంషేర్ గా చెప్పు పవన్ అంటూ మాజీ మంత్రి పేర్ని సవాల్