33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల సంచలన కామెంట్స్ .. జగన్ పై చంద్రబాబు కుట్రలు అంటూ..

Share

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో మారు ఇవేళ సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. గతంలో ఒక పర్యాయం ఆయనను సీబీఐ అధికారులు ఆయన కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపారు. ఇవేళ మరో సారి సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న ఈ తరుణంలో ఏపి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఏమాత్రం లేదనీ, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో సీఎం వైఎస్ జగన్ పై జరుగుతున్న కుట్రలుగా ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడేనన్నారు. “బాబు తనకు నచ్చిన పద్ధతిలో ఒక కట్టు కథనాన్ని తయారు చేసి, తనకు అనుకూలమైన మీడియా ద్వారా విడుదల చేస్తారు. అదే నిజం అని జనాన్ని నమ్మించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా కలిసి కుట్రలు చేస్తాయి. చంద్రబాబు గతంలో వైఎస్‌ గారిపైన కూడా ఫ్యాక్షన్‌ ముద్ర వేశారు” అని సజ్జల విమర్శించారు. గతంలో సిట్‌ రిపోర్టులు బయటకు వస్తే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు సజ్జల. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధ లేదన స్పష్టం చేశారు.

Sajjala Ramakrishna Reddy Sensational Comments on YS Viveka Murder Case

 

వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవికి సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు.  వివేకా బావ మరిది శివప్రకాష్‌ రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌రెడ్డి హత్యా స్థలానికి వెళ్లారనీ, శివశంకరరెడ్డి కూడా తప్పు చేయలేదని తాము భావిస్తున్నామన్నారు. వివేకానందరెడ్డి అజాత శత్రువు అని ఆయన చుట్టూ నేరప్రవృత్తి కలిగిన మనుషులున్నారనీ, వివేకా కుటుంబంలోనూ విభేదాలు ఉన్నాయని సజ్జల అన్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జగన్‌ ను టార్గెట్‌ చేయడానికి చూస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు.  బాబుకు ఎల్లో మీడియాలో ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపై బ్యానర్ స్టోరీలు కావాలనీ, అందుకే ఇటువంటి తప్పుడు రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌ కుటుంబానికి వివేకానందరెడ్డితో అవినాభావ సంబంధముందనీ, వివేకానందరెడ్డి విజయమ్మపై పోటీ చేసినా, ఆ తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీ లోకి వస్తానంటే సాదరంగా జగన్‌ ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అవినాష్‌రెడ్డికి ఒక తండ్రిలా సలహాలు ఇచ్చేవారని తెలిపారు. టీడీపీ, చంద్రబాబు లైన్‌కు అనుగుణంగా సీబీఐలో కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు.

నిష్పక్షపాతంగా వారు పనిచేయకపోగా, కల్పిత వాంగ్మూలాలను సృష్టించి, జగన్‌ పై వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు సజ్జల. సీబీఐ ప్రకటనల వెనుక రాజకీయ ప్రమేయముందని ఆరోపించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.  నాడు వివేకా హత్యకు, రెండో పెళ్లి కారణమన్నట్లుగా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం కూడా వచ్చిందని తెలిపారు. అప్పుడు బాబుపై ఎక్కడ ఈ కేసు పడుతుందోనని, బాబును రక్షించడానికి ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలు రాసిందని అన్నారు. బాబు, ఎల్లో మీడియా టార్గెట్‌ జగన్‌ అనీ, రాబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి నిందలు వేస్తే,  వక్రీకరణలు చేస్తే ఆ ఎన్నికల్లో ఓట్లు పడతాయనే దురాశతో, కుట్రతో ఇంతగా చేస్తున్నారనీ,  దీన్ని అందరూ గమనించాలని ఆయన సజ్జల కోరారు. దీని చుట్టూ రాజకీయాలు చేయడం, దీన్నుంచి లబ్ధిపొందాలని బాబు చూడడం రాష్ట్ర రాజకీయ దౌర్భాగ్యమని అన్నారు. వివేకా హత్య కేసును పక్కదారి పట్టించడానికి అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, భారతమ్మ పేర్లను ప్రస్తావించడం కుట్రపూరితమని సజ్జల పేర్కొన్నారు. దీని వెనుక ఉన్నదంతా చంద్రబాబేననీ, అతని మాస్టర్‌ మైండేనని సజ్జల విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం బాబుకున్న లక్షణమనీ,  ఈ కేసులోనూ బీజేపీలో కోవర్టులుగా ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు ఇన్‌ఫ్లుయన్స్‌ చేస్తున్నారని తేలిపోతుందని సజ్జల అన్నారు. దీనికి అవసరమైన కథనాలన్నీ తన ఎల్లోమీడియాలో వచ్చేలా చూడడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

ఏపి నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ .. విశేషం ఏమిటంటే..?


Share

Related posts

స్కెచ్ వేసినా వర్కౌట్ గాని ఫేక్ ఫేస్బుక్ ప్లాన్!ఆ అధికారి మిత్రులు అదృష్టవంతులే!!

Yandamuri

అరుదైన డైమండ్‌.. ధ‌రెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Teja

Jr Ntr: హిట్టవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయిందంటున్న పరుచూరి

Muraliak