ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుకి హెల్ప్ చేసిన సాక్షి పత్రిక ఆర్టికల్..వింతలకే వింత ఇది..!

Share

Chandrababu: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి ప్రధాన అనుచరుడు తోట చంద్రయ్య (35) ఇటీవల ప్రత్యర్ధుల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత సీరియస్ గా తీసుకున్నారో చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు.. చంద్రయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించడమే కాక పాడి మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. అధికార పార్టీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తుందంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

sakhi helps Chandrababu
sakhi helps Chandrababu

Chandrababu: చంద్రబాబు లక్ష్యంగా సాక్షి మీడియా కథనం

అయితే ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి ముందు చంద్రబాబు పార్టీ నేతలతో సెల్ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడిన ఓ ఆడియో టేప్ ను సాక్షి మీడియా ప్రసారం చేస్తోంది. చంద్రయ్య హత్య జరిగిన తర్వాత పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం ఈ ఆడియో టేప్ లో ఉంది. టీడీపీ కార్యకర్త హత్యను చంద్రబాబు చాలా సీరియస్ గా పరిగణించినట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది. పార్టీ కార్యకర్తను ప్రత్యర్ధులు హత్య చేస్తే దాన్ని పార్టీ అధినేతగా ఆ ఘటనను సీరియస్ గా పరిగణించి నేతలతో ఫోన్ మాట్లాడటం చంద్రబాబు చేసిన తప్పుగా సాక్షి మీడియాలో ప్రసారం చేసింది. శవ రాజకీయాలు పేరుతో చంద్రబాబు లక్ష్యంగా సాక్షి మీడియా కథనాన్ని ప్రసారం చేయడంపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు.

ఆడియో టేప్ లీక్ అంటూ

బయట పడ్డ బాబు గారి బండారం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం = చంద్రబాబు అంటూ సాక్షి మీడియా ఆడియో టేప్ లీక్ అంటూ విస్తృతంగా ప్రసారం చేసి అనవసరంగా చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అయ్యిందనే మాటలు వినబడుతున్నాయి. చంద్రయ్య అంత్య క్రియల సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ అల్లర్లను ప్రోత్సహించేలా చంద్రబాబు ఏమైనా మాట్లాడినా, అక్కడ అల్లర్లు జరిగినా చంద్రబాబును బాధ్యుడిని చేస్తూ విమర్శించినా కొంత అర్ధం ఉండేది. కానీ అటువంటిది ఏమీ జరగకుండా చంద్రబాబు పార్టీ కార్యకర్త పై జరిగిన దారుణంపై తీవ్రంగా స్పందించడం కూడా నేరమన్నట్లుగా చూపి చంద్రబాబుకు మైలేజ్ ఇచ్చినట్లు అయ్యింది.


Share

Related posts

జగన్ చప్పట్లు కొడుతుంటే.. కొందరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు..!

Muraliak

Big Breaking; క్వారంటైన్ లో పవన్ కల్యాణ్..! ఎందుకంటే..?

somaraju sharma

Sinus Breathing Problems: బ్రీతింగ్, సైనస్ సమస్యలకు ఈ సింపుల్ ఇంటి చిట్కాలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar