పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ కు సుప్రీం కోర్టు లో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు … గతంలో బెయిల్ రద్దు చేయాలని ఏపి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

గత ఏడాది పదవ తరగతి పరీక్షా పత్రాలు లీకైయ్యాయి. వాట్సాప్ ద్వారా పరీక్షా పేపర్ బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు ప్రైవేటు పాఠశాల అధ్యాపకులను అరెస్టు చేశారు. ఈ ప్రశ్నా పత్రాల లీకేజీలో నారాయణ విద్యా సంస్థ అధినేత నారాయణ పాత్ర ఉన్నట్లుగా చిత్తూరు పోలీసులు గుర్తించి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును నమోదు చేశారు. నారాయణను అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు.
ఆ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ తప్పుకున్నారనీ ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆయనకు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసుపై కొన్ని నెలలుగా జిల్లా కోర్టు, హైకోర్టులోనూ విచారణ జరిగింది. విచారణ జరిపిన హైకోర్టు నారాయణ బెయిల్ ను రద్దు చేసింది. దీంతో నారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, బెయిల్ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
వికేంద్రీకరణకు మద్దతుగా బైక్ ర్యాలీ