NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: ఒకే రోజు సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు ఒక బ్యాడ్, మరో గుడ్ న్యూస్‌ లు

Share

Supreme Court: ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఇవేళ ఒక వ్యతిరేక తీర్పు, మరో అనుకూల తీర్పులు వచ్చాయి. అవులపల్లి, ముదివీడు, నీతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేను ఎత్తివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కాకపోతే జరిమానా విధించిన రూ.100 కోట్లలో ముందుగా రూ.25 కోట్లు తక్షణం కృష్ణాబోర్డుకు డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరో పక్క అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఏపి సర్కార్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తుది తీర్పునకు లోబడి పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఒకే రోజు రెండు తీర్పులు భిన్నంగా వెలువడ్డాయి.

Supreme Court

 

వివరాల్లోకి వెళితే .. ఇటీవల ఎన్జీటీ చిత్తూరు జిల్లాలోని అవులపల్లి రిజర్వాయర్ కు పర్యావరణ అనుమతిని కొట్టి వేసింది.  ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇస్తూ ఏపి సర్కార్ రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం పిటిషన్ పై విచారణ జరిపింది. ఎన్జీటీ వంద కోట్లు జరిమానా విధించడం చట్టబద్దం కాదనీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్దమని సుప్రీం ప్రశ్నించింది. ఏపి కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, వంద కోట్లు జరిమానా భారం అవుతుందని రోహత్గీ వాదించారు.  వంద కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణాబోర్డులో జమ చేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వంద కోట్లు జరిమానా విధించవచ్చా అన్న అంశంపై మాత్రం పాక్షికంగా సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ కు వాయిదా వేసింది.

మరో పక్క అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు లో విచారణ జరిగింది. జస్టిస్ జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్ 5 జోన్ లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్ట ప్రకారమే అయిదు శాతం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Karnataka: సిద్దా రామయ్యకే మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్టానం..? హైకమాండ్ నిర్ణయంపై డీకే శివకుమార్ అసంతృప్తి


Share

Related posts

‘నిస్పృహతోనే రాద్ధాంతం’

somaraju sharma

Today Horoscope జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.

Sree matha

Deepavali: దీపావళి ఇలా జరుపుకుంటే లక్ష్మి దేవి మీ ఇంటిలోనే ఉంటుంది!!

siddhu