YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గత నెల 27వ తేదీన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. మే 5వ తేదీలోపు సీబీఐ ముందు హజరు కావాలని ఉత్తర్వులు పేర్కొన్న తెలంగాణ హైకోర్టు అదే ఉత్తర్వుల్లో జూలై 1న బెయిల్ పై విడుదల చేయాలని పేర్కొంది.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇంతకు ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ రద్దులోనే విడుదల ఆదేశాలు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెకేషన్ బెంచ్ కు పిటిషన్ ను బదిలీ చేయగా, ఇవేళ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.