33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో ఈ నెల, వచ్చే నెలలో సంక్షేమ పథకాల పంపిణీ షెడ్యుల్ ఖరారు

Share

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఏపిలో నిలిచిపోయిన వివిద సంక్షేమ పథకాల అమలు చేసే తేదీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఖరారు చేశారు. అసెంబ్లీ సమావేశాలు.. మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై సీఎంవో అధికారులతో మంగళవారం చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియనుండటంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలునకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికల కోడ్ కు సంబంధం లేని కారణంగా ఈ నెల 10వ తేదీ నుండి మధ్యాహ్న భోజనంతో పాటు రాగి జావ అమలు ప్రారంభించాలని నిర్ణయించారు. అదే విధంగా మార్చి 14వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సీఎంఓ నిర్ణయం తీసుకున్నది. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యుల్ ఖరారు చేయనున్నది. మార్చి 18న సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం.. జగనన్న విద్యాదీవెన లబ్దిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్దతిలో నగదు జమ చేయనున్నారు.

AP CM YS Jagan

 

మార్చి 22న – ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్ 10న సత్కారం, అవార్డులు, రివార్డులు అందజేత

మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం

మార్చి 25 నుంచి వైఎస్ఆర్ ఆసరా .. ఏప్రిల్ 5 వరకూ కొనసాగింపు

మార్చి 31న జగనన్న వసతి దీవెన

ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు

ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం

ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం

 

Political Survey: బాబు ఇలాకాలో జగన్ హవా .. తాజాగా వచ్చిన సర్వేలోనూ అదే లెక్క..!


Share

Related posts

Mahindra Scorpio : కొత్త సోకుల స్కార్పియో..! ధర, విశేషాలు ఇవే..!!

bharani jella

Corona Virus: కరోనా హోం కిట్స్ ప్రయోగం మంచిదే !రోగులకు చేరకపోవటమే మైనస్ ?!

Yandamuri

వాలంటీర్ల నెత్తిన పిడుగు వేసిన జగన్ : వారంతా ఇంటికే ఇక

Special Bureau