Schools Reopen: ఏపిలో పాఠశాలల పునః ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..! ఎప్పటి నుండి అంటే..?

Share

Schools Reopen: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నేపథ్యంలో మూతపడిన పాఠశాలల పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం పాఠశాలల పునః ప్రారంభోత్సవ వివరాలను వెల్లడించారు. వచ్చే నెల 16 నుండి పాఠశాలలు పునః ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పాఠశాలల పునః ప్రారంభం అయ్యేలోపు ఉపాధ్యాయులకు నూరు శాతం వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు.

Schools to reopen from august 16 minister Suresh
Schools to reopen from august 16 minister Suresh

Read More: AP CM YS Jagan: జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్..!!

రాష్ట్రంలో  రెండో విడత విద్యాకానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. విద్యాకానుకలో ఈ సారి డిక్షనరీ కూడా ఇస్తున్నామని చెప్పారు. నోటు పుస్తకాలు, టెస్టు బుక్స్, బెల్టులు వంద శాతం, స్కూలు బ్యాగ్లు 80 శాతం, యూనిఫాంలు 80 శాతం, డిక్షనరీలు 20 శాతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 15 వేల పాఠశాలలను నాడు – నేడు కింద అభివృద్ధి చేశామని చెప్పారు. నాడు – నేడు పనులు 90 -98 శాతం పూర్తి అయ్యాయన్నారు.

ఆగస్టు 16న నాడు – నేడు ఫేజ్ 2తో పాఠశాలల రూపురేఖలు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. 16 వేల పాఠశాలల్లో నాలుగు వేల కోట్ల రూపాయల అంచనాలతో ఫేజ్ 2లో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అమ్మఒడి, వసతి దీవెన వద్దనుకునే వారికి వచ్చే ఏడాది నుండి ల్యాప్ టాప్ లు అందిస్తామని మంత్రి సురేష్ ప్రకటించారు.  ఆగస్టు 16 నుండి కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.


Share

Related posts

కోపం, రౌద్రం, పౌరుషం కొడాలి నాని ఈ రేంజ్ లో ఫైర్ అవటానికి కారణం ఇదేనా…??

sekhar

Pawan Kalyan : పవన్ ఆశల మీద నీళ్లు చల్లిన బీజేపీ కీలక నేత..??

sekhar

“జమిలి” కదలికలు షురూ..! అంత ఈజీగా ఆ”మోదీ”యమా..!?

Srinivas Manem