NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

SEC : ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య మరో వివాదం..ఈ యాప్‌పై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

SEC : ఆంధ్రప్రదేశ్ AP లో గ్రామ పంచాయతీ ఎన్నికల Local body elections నేపథ్యంలో ప్రభుత్వం, ఎస్ఈసీ SEC మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వివాదం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం ఏది చేసినా ప్రభుత్వానికి చెప్పి చేయాలి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఏమి చేయడానికి వీలులేదు అన్నది ప్రభుత్వ వాదన అయితే ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్వయం ప్రతిపత్తి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీ సంస్థ కాదు అనేది ఎస్ఈసీ అభిప్రాయం. ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఫైట్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

SEC : ap government approached the High Court over the SEC app
SEC ap government approached the High Court over the SEC app

ఇప్పుడు తాజాగా వచ్చిన విషయం ఏమిటంటే..ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓ కొత్త యాప్ ను తీసుకువచ్చారు. ఈ వాచ్ యాప్ ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అయితే ఈ వాచ్ యాప్ పై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకతకు పాతర వేసిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు యాప్ రూపొందించారనీ, ఈ బండారం బయట పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుండి భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే ఎన్నికల్లో వినియోగించాలని నిర్ణయించారనేది ఆరోపణ.

ఈ యాప్ పై నేడు ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్టు గురువారం విచారణ జరపనున్నది. ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఎస్ఈసీ ప్రత్యేక యాప్ రూపొందించడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. యాప్ రూపకల్పన నుండి ప్రకటన వరకు ఎస్ఈసీ గోప్యత పాటించిందనీ, యాప్ రూపకల్పనపై అనేక అనుమానాలను వైసీపీ వ్యక్తం చేస్తోంది. ప్రజలు ప్రభుత్వ యాప్ లేదా సీఈసీ యాప్ ఉపయోగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఓ పక్క హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ యాప్ ను ఆవిష్కరించారు.  ఆ యాప్ ను ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పిర్యాదులు ఏలా చేయవచ్చు తదితర విషయాలను ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N