NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా కొనసాగడంపై సోమేష్ కుమార్ ఇచ్చిన వివరణ ఇది

తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ గురువారం ఏపి ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ఏపీ సీఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి జాయనింగ్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తో సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోమేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపి కేడర్ కు కేటాయించినందున అక్కడే విధులు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంటూ క్యాట్ ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన రోజే కేంద్ర ప్రభుత్వం సోమేష్ కుమార్ ను తెలంగాణ నుండి రిలీవ్ చేస్తూ ఈ నెల 12న (నేడు) ఏపిలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Seniour IAS Somesh Kumar Clarity On His VRS Propasal

 

అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హోదాలో పని చేసిన సోమేష్ కుమార్.. ఏపిలో ఆ పోస్టులో నియమించే అవకాశం లేనందున విఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నారనీ, విఆర్ఎస్ తీసుకున్న వెంటనే కేసిఆర్ సర్కార్ ఆయనను ప్రభుత్వ సలహాదారుగా ఢిల్లీలో ప్రభుత్వ వ్యవహారాలు చూసేందుకు నియమించనున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నుండి విమానంలో ఈ ఉదయం గన్నవరం చేరుకున్న సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపికి వచ్చానని, తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని తెలిపారు. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తానని పేర్కొన్న ఆయన.. విఆర్ఎస్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆ విషయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. మరో వైపు సోమేష్ కుమార్ స్థానంలో తెలంగాణ సర్కార్ .. సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారిని నూతన సీఎస్ గా నియమించిన సంగతి తెలిసిందే.

సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో జెడ్ స్పీడ్‌ లో స్పందించిన కేంద్రం .. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే రిలీవ్ ఉత్తర్వులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?