విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యింది. సమ్మిట్ విజయవంతంపై మంత్రులు, వైసీపీ నేతలు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. 20 రంగాలకు సంబంధించి రూ,.13లక్షల కోట్లకుపైగా పెట్టుబడులతో 352 ఎంవోయూలు జరిగాయి. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియాలో నిర్వహిస్తున్న డిబేట్ లలో వైసీపీ సర్కార్ ను విమర్శిస్తూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో 2018లో విశాఖలో టీడీపీ హయాంలో నిర్వహించిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

నాటి సదస్సులో రకరకాల వేషాలు, డ్రామాలు జరిగాయని వెల్లడిస్తున్నారు. ఇదే సందర్భంలో సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ .. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన విచిత్రమైన ఘటనను చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మంత్రిగా ఉండేవారనీ, ఆ సమయంలో చంద్రబాబు మనుషులు ఓ వ్యక్తిని తీసుకువచ్చి ఎన్టీఆర్ కు భూటాన్ రాయబారి అంటూ పరిచయం చేశారనీ, దీంతో ఆయన సంతోషపడి స్వయంగా వెంట తీసుకువెళ్లి బుద్దుడి విగ్రహం చూపించారన్నారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారన్నారు.
టుప్కా అనే భూటాన్ రాయబారి వచ్చారనీ, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను కలిసినట్లుగా ప్రచారం జరిగిందన్నారు. అప్పట్లో తాను ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పని చేస్తుండే వాడిననీ, ఆ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద స్వెట్టర్ లు అమ్ముకునే వ్యక్తి ఫోటో చూపించి ఇతనే కదా రీసెంట్ గా ఎన్టీఆర్ ను కలిసి భూటాన్ రాయబారి అని చెప్పారన్నారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుదని అమర్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి ఇటువంటి ఫేక్ షోలు చేయడం అలవాటు అని అమర్ వ్యాఖ్యానించారు.
జీఐఎస్ సక్సెస్ తో వైసీపీ విజయోత్సవ సంబరాలకు ప్లాన్ .. ఎలా అంటే ..?