గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాలువలో దూసుకువెళ్లి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు మరణించారు. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 40 మంది ఉన్నట్లు తెలుస్తొంది.

ప్రత్తిపాడు మండలం కొండెపాడుకు చెందిన వీరంతా చేబ్రోలు మండలం జూపూడికి శుభ కార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను నాగమ్మ, మేరమ్మ, రత్నకుమారి, నిర్మల, సుహాసిని, మామిడి ఝాన్సీరాణి, సలోమిగా గుర్తించారు.
మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?