TDP Ex MLA Dhulipalla Narendra: గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేబ్రోలు మండలం శేకూరు గ్రామ ప్రజలు షాక్ ఇచ్చారు. ఈ గ్రామంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల అభివృద్ధికి శేకూరు వేణుగోపాలస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న చెరువు పూడిక తీత మట్టిని గ్రామస్తులు తరలించుకుంటున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానంతో గ్రామ ప్రజలు చెరువు నుండి మట్టితోలకాలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ నాయకులతో చెరువులో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లగా.. గ్రామస్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ గ్రామంలోని మట్టిని అంతా రైల్వేకు ఇతర అవసరాలకు దూళిపాళ ఆధ్వర్యంలో అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఆయనను గ్రామస్తులు చుట్టుముట్టి దుర్భాషలాడారు. తాము గ్రామ పంచాయతీ తీర్మానంతో ఇళ్ల నిర్మాణాలకు, రోడ్లకు చెరువు పూడిక తీత మట్టిని తరలించుకుంటుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ ధూళిపాళ్ల ను నిలదీశారు. దాదాపు గంట పాటు ఆయనను కదలనివ్వకుండా గ్రామస్తులు చుట్టుముట్టారు. గ్రామస్తుల ప్రతిఘటన నుండి ఆయన బయట పడే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన ను గ్రామం నుండి సురక్షితంగా పంపించారు. ఆ తరువాత గ్రామస్తులు చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…