KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తినాల్సిన పరిస్థితి.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ఎన్నికలకు కసరత్తు చేస్తుండగా… ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది. కార్పొరేటర్ టికెట్ కోసం ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ ఓ పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికల వేళ… షాక్….
వరంగల్ ఎన్నికల సమయంలో సహజంగానే టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలోనే సదరు పాంప్లెంట్ కలకలం రేపుతోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం ప్రత్యక్షమైంది. మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్న వారికి కాకుండా రౌడీషీటర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆ కరపత్రాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్లలో సర్వేల పేరుతో టికెట్లను కేటాయిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం చేస్తున్నా.. అవి నామమాత్రమేనని ఎమ్మెల్యేలే చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కరపత్రంలో రాసుకరావడంతో చర్చగా మారింది.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలిచే అభ్యర్థులకు, పార్టీ కోసం పనిచేసే వారికి, విద్యావంతులకు టికెట్లు దక్కేలా చూడాలని, దీనిపై ట్విట్టర్లో స్పందించాలని కోరడం ఆశావహులు టికెట్ ఆశించి చేదుఅనుభవం ఎదురైనవారు కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రం విడుదల చేయడంతో వరంగల్‌లో కలకలం రేపుతోంది.
ఆ ఎమ్మెల్యేలు బుక్కయినట్లేనా?
ఎన్నికల సమయంలో కరపత్రం అధికార పార్టీలో వివాదంగా మారగా.. ప్రతిపక్షాలే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరి ఈ కరపత్రాలు రాసింది ఎవరు.. ఫ్రింట్ చేయించింది ఎవరు? అనేది తేలాల్సి ఉన్నా.. ఎన్నికల ముందు ఈ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరోవైపు ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?