గత కొద్దికాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా పలు అంశాలకు కేసీఆర్ ఓకే చెప్తున్నారు. వివిధ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు.
అయితే ఇలాంటి సంచలన నిర్ణయాల పరంపరలో మరో అంశం హైదరాబాద్ లో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇటీవల జరిగిన GHMC ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. ఈ కారణంగానే హైదరాబాద్ లో మళ్లీ ఎన్నికలు జరగవచ్చని చెప్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఏం జరగాలి ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 150 డివిజన్లలోనూ పోటీ చేసిన టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని ఏకపక్షంగా దక్కించుకోవాలనుకుంది. అయితే , ఫలితాలు అధికార పక్షానికి ఏ మాత్రం ఆశాజనకంగా రాలేదు. అటుఇటు అయినా ఎక్స్అఫీషియో సభ్యులతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అనుకుంది. ఇప్పుడు అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా ఉన్నా.. మేయర్ కుర్చీలో కూర్చోలేని పరిస్థితిలో గులాబీ పార్టీ ఉంది. దీంతో ప్రస్తుత పాలకమండలి ముగింపు గడువు దగ్గర పడే కొద్దీ టీఆర్ఎస్ ఏం చేస్తుందన్న అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత పాలకమండలి సమయం ముగిసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియకే TRS మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆ విషయంపైనే పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
తేడా వస్తే ….
గ్రేటర్ హైదరాబాద్ సీట్ విషయంలో రాజకీయ సమీకరణాలు కొలిక్కి రాకపోతే.. ఫిబ్రవరి తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుందంటున్నారు. కొన్నాళ్లు అలా గడిచిపోయిన తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరి వాదన. అయితే ఈ రెండింటిలో అధికారపార్టీ ఏ ఆప్షన్ ఎంచుకుంటుంది? ఒకవేళ రెండూ బాగున్నాయని భావిస్తుందా? ఇలా ఎవరికి వారు ఆరా తీస్తున్నారట. మొత్తానికి GHMCలో వచ్చిన హంగ్ ఫలితాలు రాజకీయ ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఏమో ఎన్నికలు వచ్చినా రావచ్చని ఇంకొందరు కామెంట్ చేస్తుండటం కొసమెరుపు .
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?