తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో దీర్ఘకాలం కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి గుడ్ బై చెప్పేయడంతో కొత్త నేత ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో సహజంగానే ఢిల్లీ పెద్దలు కొత్త నాయకుడిపై దృష్టిపెట్టారు. పీసీసీ ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది . పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి రావడం … ఇవాళో.. రేపో అధికారికంగా ప్రకటన చేస్తుందన్న సమయంలో.. ఉన్నట్టుండి కీలక ప్రకటన వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికమ్ ఠాగూర్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ నియామకాన్ని వాయిదా వేసుకోవాలన్న సీనియర్ నాయకుడు జానారెడ్డి విజ్ఞప్తిని సోనియా గాంధీ ఆమోదించారని తెలిపారు..
పీసీసీ ఎంపికపై జరుగుతోన్న ప్రచారంపై ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి రావడం మీడియా సృష్టి మాత్రమే అన్నారు.. సంప్రదింపుల ప్రకియ ఇంకా పూర్తి కాలేదని…నాగార్జునసాగర్ ఉపఎన్నికల తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తిస్థాయి జట్టును ప్రకటిస్తామని . పిసిసి, ప్రచార కమిటీతో సహా అన్ని కమిటీలు ఉంటాయని వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎన్నికలు కీలకం.. మేం ఖచ్చితంగా గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేశారు ఠాగూర్.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీటైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ పరిణామాలు రేవంత్ రెడ్డికి ఉన్న పట్టును తేటతెల్లం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు కామెంట్ చేస్తున్నారు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…