ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏదో తేడా కొడుతోందేంటి… బాల‌య్య రూట్ మారుతోందా?

Share

నంద‌మూరి బాల‌కృష్ణ .. సినీ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న న‌టుడు. రాజ‌కీయాల్లో అడుగుపెట్టి త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు ఏర్పాటు చేసిన టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే బాల‌య్య పై కొత్త టాక్ వినిపిస్తోంది. పార్టీలో అతి కొద్ది మందితోనే మాట్లాడే బాలయ్య ఒకటి రెండు సందర్భాల్లో తన అసంతృప్తిని వెళ్ల గక్కారట. పార్టీ పోకడలు, అదిష్టానం వైఖరిపై ఘాటు విమర్శలు చెయ్యకున్నా, కొంత అసంతృఫ్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఆస‌క్తిక‌ర కార‌ణం వినిపిస్తోంది.

బాల‌కృష్ణ ను గౌర‌వించారా ? అవ‌మానించారా?

ఇంత‌కూ త‌న‌కు టీడీపీలో ద‌క్కింది గౌర‌వ‌మా? అంద‌రితో పాటు ద‌క్కిన సాదాసీదా పోస్టా అనేది బాల‌య్య తేల్చుకోలేక‌పోతున్నారట‌. కొద్ది రోజుల క్రితం అధినేత చంద్రబాబు వేసిన పార్టీ కమిటీల్లో బాలయ్యకు చోటు కల్పించారు. అప్పటి వరకు పార్టీలో ఎమ్మెల్యేగానే ఉన్న బాలకృష్ణను పార్టీ ఉన్నత వేదిక పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అయితే పొలిట్ బ్యూరో సంఖ్యను అమాంతం 25కు పెంచడంతో దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. కొత్త వారికి పదవి వచ్చిందన్న ఆనందం లేకపోగా, ఇప్పటి కే సభ్యులుగా ఉన్న వారు కీలక వ్యవస్థని పలుచన చేశారనే అభిప్రాయానికి వచ్చేశారు.

బాల‌య్య హ‌ర్ట్ .. హ‌ర్ట్ అయ్యారంతే….

బాల‌కృష్ణ‌ను పార్టీలోకి తీసుకున్న స‌మ‌యంలో ఆయ‌న గురించి జ‌రిగిన చ‌ర్చ త‌న‌ను హ‌ర్ట్ చేసింద‌ని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌లు కొందరు పొలిట్ బ్యూరో ని ఆశించడగా, బాలయ్య పేరుతో వారికి సర్ది చెప్పారు. బాలయ్య ని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న కారణంగానే ఇదే సామాజికవర్గం నుంచి ఇతర నేతలకు అవకాశం ఇవ్వలేకపోతున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. దీంతో… త‌న‌ను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న తరువాత కూడా ఆయన అంత సంతృఫ్తిగా లేరనే వాదన వినిపిస్తుంది.

అందుకే అదిరిపోయేలా…

పార్టీలో త‌న‌కు జ‌రుగుతున్న ప‌రిణామం గురించి బాల‌య్య హ‌ర్ట‌య్యార‌ని చెప్తున్నారు. అందుకే జ‌న‌వ‌రి మొద‌టి వారంలో జ‌రిగిన పొలిట్ బ్యూరో స‌మావేశానికి హాజ‌రు కాలేద‌ని చెప్తున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో టూర్ పెట్టుకున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా బాలయ్య ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనేది పార్టీలో చర్చగా మారింది.


Share

Related posts

Breaking News: మైనర్ బాలిక ప్రేమించడం లేదని నాటు తుపాకీతో కాల్చాడు – చిత్తూరు జిల్లాలో ఘటన..!!

Srinivas Manem

నా పార్టీ బీజేపీ…. సోనియా గాంధీ నా త‌ల్లి , రాహుల్ గాంధీ నా త‌మ్ముడు

sridhar

AP CM YS Jagan: ఏపిలో కర్ఫ్యూ అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar