NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి లో రూ.23వేల కోట్ల పెట్టుబడులకు ఎన్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ .. భారీగా ఉద్యోగ అవకాశాలు

ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎన్ఐపీబీ) సమావేశం జరిగింది. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎన్ డబ్ల్యు ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎన్ఐసీబీ ఆమోదం తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఎన్ఈపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎన్ఐపీబీ ఆమోదం తెలిపింది.

AP CM YS Jagan

 

కడప జిల్లాలో సున్నపురాళ్లపల్లిలో జేఎన్ డబ్యు స్టీల్ రెండు విడతలుగా రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి దశలో ఏడాదికి ఒక మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో దశలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీలు ఉత్పత్తులు, మొత్తంగా ఏడాదికి మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు చేయనుంది. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వెనుకబడిన రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని అన్నారు సీఎం జగన్. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయనీ, తద్వాారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.

రూ.6,300 కోట్ల పెట్టుబడితో ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వల్ల ప్రత్యక్షంగా 4వేల మందికి ఉపాధి లభించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోట లో వేయి మెగావాట్లు, అనకాపల్లి , విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్టు ను డిసెంబర్ 2024 లో ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంగా తెలిపారు. రూ.8,855 కోట్లతో ఎర్రవరం, సోమశిల వద్ద రెండు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారిగా అయిదేళ్లలో డిసెంబర్ 2028 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా 2100 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju