Sirevennela Seetharama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారాామ శాస్త్రి ఇక లేరు..!!

Sirivennela: PadhaSIRI never Dies
Share

Sirevennela Seetharama Sastry: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది కళాకారులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రెండు రోజుల క్రితమే ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. చిత్రసీమ ఈ విషాదం నుండి తేరుకోకముందే ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (55) కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియోతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేటి సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సీతారామ శాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో మరో సారి విషాదఛాయలు అలుముకున్నాయి. కె విశ్వనాధ్ దర్శకత్వంలో నిర్మించిన “సిరివెన్నెల” చిత్రంలో “విధాత తలపున” గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన సీతారామ శాస్త్రి ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా సుస్ధిరం చేసుకున్నారు. ఆసలు ఆయన ఇంటి పేరు చేంబోలు.

Sirevennela Seetharama Sastry passed away
Sirevennela Seetharama Sastry passed away

చెంబోలు సీతారామ శాస్త్రి 1955 అనకాపల్లి మండలంలో డాక్టర్ సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన పదవ తరగతి వరకూ అనకాపల్లిలోనే చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో బీఏ పూర్తి చేశారు. అయితే అప్పట్లో పీజీ పూర్తి చేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడంతో మెడిసిన్ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ ఆయన ఆసక్తి చూపలేదు. డిగ్రీ పూర్తి చేసినా పదవ తరగతి అర్హతతో బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం రావడం వల్ల రాజమండ్రిలో కొన్నాళ్లు పని చేశారు.

ఆయన సినీ కేరీర్ విషయానికి వస్తే 1986లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాదాపు 800కు పైగా పాటలు రాశారు. సీతారామ శాస్త్రి గేయ రచయిత గానే కాక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాలో నటుడిగా మారారు. ఈ సినిమాలో నిగ్దదీసి అడుగు ఈ సిగ్గులేని  జనాన్ని పాటను రాశారు. ఆయనకు భార్య పద్మవతి, కుమారులు రాజా, యోగేష్ లు ఉన్నారు. కుమారుడు రాజా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. సినీ పరిశ్రమకు సీతారామ శాస్త్రి చేసిన సేవలకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సీతారామ శాస్త్రి పాటలను శ్రోతలు ఎంతగా అక్కున చేర్చుకున్నారో అదే స్థాయిలో అవార్డులు సైతం ఆయనను వరించాయి. ఆయన రాసిన తొలి పాట విధాత తలపున కే నంది అవార్డు రావడం విశేషం. ఆ తరువాత మొత్తం 11 సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇవి కాక అనేక పురస్కారాలు, సత్కారాలు ఆయన అందుకున్నారు.

 


Share

Related posts

తమిళ రాజకీయాలలో ఉన్న సస్పెన్స్ కు ఈ రోజు తెర దించబోతున్నారా?

Kumar

టీపీసీసీ చీఫ్ రేసు : అందరిదీ ఓక బాధ అయితే కోమటి రెడ్డిది మరో బాధ…! సొంత వారే అసలు ప్రాబ్లం

siddhu

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha