AP Govt: రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు అందించడంతో పాటు ఆ రుణాలు సద్వినియోగం చేసుకుని, సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఏపి సర్కార్ వివిధ రూపాల్లో అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ గోల్డ్ అవార్డు అందించింది.

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కు అనుబంధంగా పని చేస్తున్న స్త్రీ నిధి సంస్థ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి పొదుపు సంఘాల మహిళలకు సులభ విధానంలో రుణాలు అందజేస్తున్నందుకు స్త్రీ నిధి సంస్థ స్కోచ్ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు అవార్డులు చూపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ సందర్భంగా అధికారులను అభినందించారు.
YS Viveka Murder Case: వాస్తవాలు ప్రజలకు తెలియాలంటూ వీడియో విడుదల చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి