NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పాపం ఐఏఎస్ లు !!ఆంధ్ర తీరే వేరు!!

 

 

ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది ఏపీ ఐఏఎస్ అధికారుల తీరు. పనికి సంస్థల ఎన్నికలపై ఇటు ప్రభుత్వానికి అటు ఎన్నికల కమిషనర్ కు జరుగుతున్న ఫైట్ లో చివరకు ఎటు కాకుండా పోతోంది అధికారులే. ఎన్నికల కమిషనర్ ను కలిస్తే ముఖ్యమంత్రి ఎక్కడ కోపం వస్తుందోనని ఒకవేళ కలవకపోతే ఎన్నికల కమిషనర్ ఎలాంటి తఖీదులు ఇస్తారో అని భయం భయం తో సర్వీస్ లో ఎప్పుడూ ఎదుర్కొని ఒక వింత పరిస్థితినీ వారు ఎదుర్కొంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో.. చివరికి ఏం జరుగుతుందో తెలియక ఆంధ్రప్రదేశ్ అఖిల భారత సర్వీసు అధికారులు టెన్షన్ టెన్షన్ తో రోజో యుగంలా గడుపుతున్నారు.

వారి పరిస్థితి మరీ దారుణం!

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే ది సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేసేది పంచాయతీరాజ్ శాఖకు చెందిన కమిషనర్, ముఖ్య కార్యదర్శులు. ఈ రెండు స్థానాల్లో ఉన్న గోపాలకృష్ణ ద్వివేది, గిరిజ శంకర్ లు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రభుత్వం ఆటలో ప్రధానమైన పావులుగా తయారయ్యారు. హైకోర్టు బెంచ్ తీర్పు చెప్పడంతో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టడానికి నిమ్మగడ్డ రమేష్ కి రెడీ అవుతున్న తరుణంలో శుక్రవారం ఈ ఇద్దరు అధికారులను సమావేశానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆహ్వానించారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరయితే ఏం జరుగుతుందో భయపడుతూ ఈ ఇద్దరు అధికారులు ముఖ్యమంత్రి సమావేశం పేరు చెప్పి తప్పించుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా షెడ్యూల్ మార్చి నప్పటికీ ఇద్దరు అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశానికి మాత్రం రాలేదు. ఎన్నికల షెడ్యూల్ శనివారం ప్రకటించనున్న నేపథ్యంలో రావలసిన ముఖ్యమైన సమావేశానికి ఇద్దరు అధికారులు రాకపోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిమీద గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే దీని మీద ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. ఇద్దరూ సర్వీసు అధికారులు తనకు సహకరించడం లేదని, గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు అయితే గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న దాని మీద ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఒకవేళ జగన్ ను కాదని సమావేశానికి హాజరయితే అప్పుడు మరో కొత్త ఇబ్బంది తప్పదని.. ఇంకా బోలెడు సర్వీసు ఉన్న ఇద్దరు అధికారులు తర్వాత తర్వాత ప్రభుత్వ వేధింపులకు గురయ్యే అవకాశం ఉండటమే ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ కు వారు ప్రతి స్పందించకపోవడం కి అసలు కారణం. వీరిద్దరే కాదు మిగిలిన మున్సిపల్ శాఖ అధికారులు, ఎన్నికల నిర్వహణ తో సంబంధం ఉన్నవారు అంతా ఇప్పుడు ఇటు ఎన్నికల కమిషనర్ కు బాధ్యత వహించాలా లేక ప్రభుత్వానికి బాధ్యత వహించాల అనే విషయం మీద సతమతమవుతున్నారు.

ఎం జరుగుతుంది??

ఎన్నికల నిర్వహణ అంశంలో ఎన్నికల కమిషన్ కు పూర్తి అధికారం ఉంటుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కానుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా అధికారుల మీద సిబ్బంది మీద అజమాయిషీ చెలఇస్తుంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలకు గ్రామంలోనే ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అంటే అధికారులు సిబ్బంది ఆయన సూచనల ప్రకారం సలహా తీసుకొని పాటించి నిర్వర్తించాలి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అది ఎక్కడా జరగడం లేదు. ఉద్యోగులు సిబ్బంది అధికారులు అంతా ఎన్నికల కమిషనర్ కు అంతర్గత సహాయ నిరాకరణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు తాము నిర్వహించే లేము అంటూ రకరకాల ప్రకటనలు గుప్పిస్తూ కొత్త వివాదానికి తెర లేపుతున్నారు.

వారిని ఎం చేస్తారు?

ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న వేళ గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గుంటూరు చిత్తూరు జిల్లా కలెక్టర్లను ఎన్నికల విధుల్లో నుంచి తప్పించాలని అప్పట్లోనే ప్రభుత్వాన్ని ఆదేశించారు. వీరితో పాటు కొందరు పోలీసు అధికారులు అప్పటి గుంటూరు ఎస్పీ విజయరావు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్కుమార్ లు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. శ్రీకాళహస్తి పలమనేరు డీఎస్పీ లను పక్కకు తప్పించారు. తిరుపతి పలమనేరు రాయదుర్గం శ్రీకాళహస్తి సీఐలను వేటు వేశారు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ అధికారులందరినీ అక్కడే ఉంచుతారా లేక ప్రస్తుతం ఉన్న ప్రదేశాల్లోనూ ఇతర అధికారులను నియమిస్తారు అన్నది సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతం గుంటూరు చిత్తూరు కలెక్టర్లు అలాగే కొనసాగుతున్నారు. గుంటూరు చిత్తూరు జిల్లా ఎస్పీలు సైతం అలాగే ఉన్నారు. మరి వీరిని ఇప్పుడు ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ పంపిస్తారా లేక వారికి తగు ఆదేశాలు జారీ చేసి, ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా అడ్డుకుంటారా అన్నది అర్థం కాని విషయం. అయితే ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల మీద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అప్పుడు సైతం గుంటూరు చిత్తూరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడేందుకు ఆయన అంత ఆసక్తి చూపలేదు. అక్కడి జాయింట్ కలెక్టర్ లతోనే నిమ్మగడ్డ మాట్లాడిన సమావేశం ముగించారు. అంటే నిమ్మగడ్డ దృష్టిలో వారిద్దరూ ఎన్నికల విధుల్లో లేనట్లే భావించాలి. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు అమలు అవుతాయా లేక జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది తర్వాత అధికారికంగా ఉద్యోగ సంఘాలు ఏం చేయబోతున్నాయి అనే మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఎదురుగా ఉన్నాయి.

author avatar
Comrade CHE

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk