NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Somu Veerraju: ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్ధమవుతోందా..!?

somu veerraju comments

Somu Veerraju: ‘ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగాలి.. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచాలి.. ఓట్లు సాధించాలి..’ ఇదీ బీజేపీ అధిష్టానం కోరుకునేది. కానీ.. నేతల స్వయంకృతాపరాధం బీజేపీకి నష్టం చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకటే అనడంలో సందేహం లేదు. కానీ.. తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రీసెంట్ గా ‘కడప జిల్లాలో ఎయిర్ పోర్టు అనే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగి కడప జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కానీ.. ఆయన తీరుతో బీజేపీతో మిత్రపక్షంలో ఉన్న జనసేనకు కూడా నష్టం కలిగిస్తుందనే చెప్పాలి.

somu veerraju comments
somu veerraju comments

వివాదాస్పద వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అనే అంశాన్ని సీఎం జగన్ తెరమీదకు తెచ్చినప్పుడు.. సోము వీర్రాజు స్పందిస్తూ.. తాము అధికారంలోకి వస్తే జిల్లాకో రాజధాని ఏర్పాటు చేస్తామని అన్నారు. రీసెంట్ గా తాము అధికారంలోకి వస్తే మద్యం బాటిల్ 75కే ఇస్తాం.. ఆదాయం బాగుంటే 50కే ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు.. కడప జిల్లాలో ఎయిర్ పోర్ట్ అంశంపై మాట్లాడుతూ.. ‘హత్యలు చేసే జిల్లాలో ఎయిర్ పోర్టా..? వాళ్లకు హత్యలు చేయడమే తెలుసని చేసిన వ్యాఖ్యలు ఆయనకే కాదు.. అటు బీజేపీ, ఇటు జనసేనపై కూడా ఎఫెక్ట్ చూపేదే. ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు బీజేపీకి, సోము వీర్రాజు వరకే పరిమితమైనా.. ఎన్నికల్లో కలిసి వెళ్తే మాత్రం పవన్ కల్యాణ్ కూడా వీర్రాజు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

మిత్రపక్షం పరిస్థితి..

తనకు అధిష్టానం సహకరిస్తున్నంతగా.. స్థానికంగా సహకారం లేదని పవన్ ఆమధ్య చేసిన వ్యాఖ్యలతో మరునాడే పవన్ ఇంటికి సోము వీర్రాజు వెళ్లి మనస్పర్ధలకు చెక్ పెట్టారు. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. కానీ.. సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఇరు పార్టీలను ఇరుకున పెడుతున్నాయనే చెప్పాలి. పార్టీ పరంగా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమే అయినా.. పోత్తు ఉండటంతో రెండు పార్టీలపై ప్రజల్లో ఎంతోకొంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాలి. దీనిపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. మిత్రబంధం ఉన్నప్పుడు జాగ్రత్తలు అవసరం.

author avatar
Muraliak

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju