NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: మంత్రి సిదిరి అప్పలరాజు వీడియోను పోస్టు చేసి మరీ దీనిని ఏమనాలి అంటూ జగన్ ను ప్రశ్నించిన సోము వీర్రాజు

Somu Veerraju: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న అమలాపురం వెళుతుండగా జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు వాహనాన్ని సోము వీర్రాజు వాహానానికి అడ్డుగా పెట్టి ముందు వెళ్లకుండా నిలులవరించడంతో ఆయన తీవ్ర అసహానికి గురై పోలీసులపై చింతులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విశాఖ స్వరూపానందేంద్ర స్వామి మఠం వద్ద పోలీసు అధికారిపై మంత్రి సిదిరి అప్పలరావు దుర్భాషలాడిన వీడియోను పోస్టు చేస్తూ.. దీనిని ఏమనాలి అంటూ సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు సోము వీర్రాజు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అహంకారంతో ప్రవర్తించినా రాష్ట్ర ప్రజలు, పోలీసులు వాటిని ప్రశంసలుగా స్వీకరించాలా అని ప్రశ్నించారు. ఒక ప్రైవేటు లారీని మా వాహనానికి ఎదురుగా ఉంచితే ప్రతిఘటించక గంటల పాటు తాము చేతులు కట్టుకుని నిలబడలా అంటూ వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Somu Veerraju Fires on CM Jagan
Somu Veerraju Fires on CM Jagan

 

ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రతిపాదన నేపథ్యంలో అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆ నేపథ్యంలోనే విధ్వంసకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ అల్లర్ల కేసులో ఇప్పటికే పోలీసులు వివిధ పార్టీలకు చెందిన వంద మందికిపైగా అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీలకు చెందిన వారు ఉన్నారు. అమలాపురం తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలు అవుతున్నారు. అయితే అమలాపురంలో బాధితులను పరామర్శించేందుకు సోము వీర్రాజు వెళుతున్న సమయంలో అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆ తరువాత జిల్లా ఎస్పీ తో మాట్లాడిన తరువాత రావులపాలెం వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. కాగా మరో పక్క సోము వీర్రాజు పై పెట్టిన కేసును ఎత్తివేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju